Telangana: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే పలు ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను నియమించింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆయా ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది.
ఎంసెట్ ప్రవేశ పరీక్ష పేరును మార్పు..
ఈ మేరకు ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లుగా TS EAPCET కన్వీనర్‌గా ప్రొఫెసర్ కుమార్, ICET కన్వీనర్‌గా ప్రొఫెసర్ సరసింహా చారి, TSECET కన్వీనర్‌గా ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, TS LAW CET కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, TS EDCET కన్వీనర్‌గా ప్రొఫెసర్ మృణాళిని, TSPECET కన్వీనర్‌గా ప్రొఫెసర్ రాజేష్ కుమార్ నియమితులయ్యారు. ఇక ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఈసారి ఎంసెట్ ప్రవేశ పరీక్ష పేరును మారుస్తూ.. ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. గతంలో ఇంజినీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలకు ఎంసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేసేవారు. కానీ ప్రస్తుతం మెడిసిన్, డెంటల్, యునానీ, ఆయుర్వేద, హోమియో కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ను నిర్వహిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయిలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి : BREAKING: రేపు సా.4గంటలకు బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం
నియమితులైన కన్వీనర్లు వీరే..
ఎప్‌సెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ బి.డీన్ కుమార్
పీజీఈసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ అరుణ కుమారి
ఐసెట్ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి
ఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్
లాసెట్, పీజీ ఎల్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ విజయలక్ష్మి
ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ మృణాళిని నియామకం
పీఈ సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్
ఎంసెట్‌కు బదులు ఎప్‌సెట్..
అలాగే మెడిసిన్(M) అనే పదాన్ని ఎంసెట్ నుంచి తొలగించింది. దీంతో ఎంసెట్‌కు బదులు ఎప్‌సెట్‌గా మారనుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు మాత్రమే నిర్వహించే పరీక్ష కావడంతో ఎప్‌సెట్ (టీఎస్ ఈఏపీసీఈటీ)గా పేరు ఖరారు చేశారు. ఈ ఎప్‌సెట్ పరీక్షను మే 9 నుంచి మే 13 వరకు నిర్వహించనున్నారు. కాగా, ఇంజినీరింగ్ విభాగానికి మే 9 నుంచి 11 వరకు పరీక్ష జరగనుంది. అగ్రి కలర్చర్, ఫార్మసీ విభాగాలకు మే 12, 13 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు జేఎన్‌టీయూ ఆద్వర్యంలో జరగనున్నాయి.
వీసీల నియామకానికి నోటిఫికేషన్..
అలాగే.. తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా, జేఎన్‌టీయూ హైదరాబాద్, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలకు వీసీల నియామకానికి విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 12న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించింది.