Beauty Tips: అందంగా ఉండాలని ఎంతోమంది ఖరీదైన బ్యూటీ వస్తువులను వాడుతూ ఉంటారు. వాటివల్ల కొంచెం అందం పెరిగిన సైడ్ ఎఫెక్ట్ కచ్చితంగా వస్తాయని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మ సౌందర్యాన్ని పెంచే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల చర్మం, ముఖం ఎంతో అందంగా మెరిసేలా ఉంటుంది. అలాంటి వాటిల్లో శనగపిండి, తేనె ఒకటి. ఈ రెండు ఉపయోగించటం వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది. ఇంకా వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
శనగపిండి తేనెతో ఆరోగ్య చిట్కాలు:
- చర్మానికి తేనె ఎంతో మేలు చేస్తుంది. దీనిని రోజుకి రెండుసార్లు ముఖంపై రాసుకుంటే చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది. ఇలా కొన్ని రోజులు ఈ చిట్కాను ఫాలో అయితే చర్మం మెరుస్తుంది.
- పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల ముఖం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. అంతేకాకుండా పసుపులో శనగపిండి కలిపి చర్మానికి పూసుకుంటే యూత్‌లా చర్మం కనిపిస్తుంది. చర్మం రంగు కూడా మెరిసేలా చేస్తుంది.
- పసుపు శెనగపిండి రెండు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత నీళ్లు తడుపుతూ చేతి వేళ్ళను సర్కిల్ చేసుకుంటూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం శుభ్రం అయ్యి మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు చర్మం నిగారింపు పెరుగుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మీ ముఖం చంద్రుడిలా మెరిసిపోవాలంటే ఈ చిట్కా ట్రై చేయండి!