Beauty Dates : ఖర్జూరాలతో అందమైన చర్మం మీ సొంతం.. ఎలాగంటే?

ఖర్జూరాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి, ముఖ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా, అందంగా మార్తుంది. ఖర్జూరాల గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.

New Update
Beauty Dates : ఖర్జూరాలతో అందమైన చర్మం మీ సొంతం.. ఎలాగంటే?

Dates Benefits : ఖర్జూరాలను (Dates) ఉపయోగించడం ద్వారా మెరిసే, అందమైన చర్మాన్ని (Beautiful Skin) కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఇది ముఖాన్ని మెరిసేలా చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మొటిమలను తొలగించడంలో సహాయపడుతుందని చర్మ నిపుణులు అంటున్నారు. ఖర్జూరాన్ని ఉపయోగించడం ద్వారా ముఖాన్ని మృదువుగా, కాంతివంతం ఉంటుంది. ఖర్జూరాలను ముఖాన్ని వాడితే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఖర్జూరతో మెరిసే అందం:

  • ఖర్జూరాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి (Health), ముఖ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
  • ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా, అందంగా మార్చడంలో సహాయపడుతుంది.
  • ప్రతిరోజూ 3-4 ఖర్జూరాలను స్నాక్స్, స్మూతీస్, గంజిలో కూడా తినవచ్చు.
  • 2-3 ఖర్జూరాలను నీళ్లలో నానబెట్టి తర్వాత వాటిని మెత్తగా చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15-20 నిమిషాల పాటు అప్లై చేసి తర్వాత కడిగేయాలి.
  • ఖర్జూరం నుంచి స్క్రబ్ చేయడానికి 2 ఖర్జూరాలను గ్రైండ్ లో పౌడర్ చేసి దానికి 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ పెరుగు వేసి సున్నితంగా మసాజ్ చేయాలి.
  • దీన్ని ఉపయోగించే ముందు.. ప్యాచ్ టెస్ట్ చేయాలని గుర్తుంచుకోవాలి. కొంతమందికి ఇది అలెర్జీ కావచ్చు. అందుకని ఇది ట్రై చేసే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నెయిల్ పాలిష్ వేయడం వల్ల ఏదైనా హాని జరుగుతుందా?

Advertisment
తాజా కథనాలు