/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/jobs-1-jpg.webp)
Apply RRB Jobs : ప్రభుత్వ ఉద్యోగాల(Government Jobs) కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముఖ్యగమనిక. రైల్వే మంత్రిత్వశాఖలో 9,144 టెక్నీషియన్ పోస్టు(Technician Posts) ల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని రోజుల్లోనే ముగియనుంది. అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 21 ఆర్ఆర్ బీ లా(RRB Law) ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగ నోటిఫికేషన్(Job Notification) లో ముఖ్యాంశాలు చూద్దాం.
నోటిఫికేషన్ కు సంబంధించి ముఖ్యమైన అంశాలు:
పోస్టుల వివరాలు:
మొత్తం 9,144 ఉద్యోగాలు ఉండగా.. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 1092 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి.
వయస్సు:
జులై 1, 2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36ఏళ్లు నిండి ఉండాలి. గ్రేడ్ 3 పోస్టులకు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఓబీపీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులు..ఆయా కేటగిరీల వారికి వయో సడలింపును కల్పించారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు రసుము రూ. 500 ఉంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసిన తర్వాత రూ. 400 రిఫండ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలు, థర్డ్ జెండర్, ఈబీసీలు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక ఉంటుంది.
జీతం:
-టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు ఏడో సీపీసీలో లెవెల్ 5 కింద ప్రారంభ వేతనం రూ. 29, 200 టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు లెవెల్ 2 కింద రూ. 19,900 చొప్పున చెల్లిస్తారు.
-టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి, జోన్ల వారీగా పోస్టుల సంఖ్య, పరీక్ష ప్యాట్రన్, సిలబస్ వంటి పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్…వాయిదా పడిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవే..!