OMIDA ఇటీవలి నివేదికలో స్మార్ట్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు , ల్యాప్‌టాప్‌ల వంటి పరికరాలలో OLED డిస్‌ప్లేల కోసం వినియోగదారుల డిమాండ్ పెరిగినట్టు తెలిపింది.అయితే వీటి వినియోగం 2023-2031 మధ్య 37% పెరుగనున్నట్లు పేర్కొంది. Apple ప్రో మోడళ్లలో కంపెనీ ఉత్తమ Apple సిలికాన్ ప్రాసెసర్ ఉంది. కానీ Apple ఇంకా OLED డిస్‌ప్లేతో కూడిన MacBook Proని విడుదల చేయలేదు,కానీ అది వినియోగదారులకు నాణ్యత తో కూడిన డిస్ ప్లేను అందిస్తుంది.
OMIDA నివేదిక ప్రకారం, 2024 నాటికి Ultra Retina XDR OLEDతో కూడిన iPad Pro కోసం ఊహించిన డిమాండ్ పెరుగుతుంది. ఆపిల్ తన మొత్తం ఐప్యాడ్ లైనప్‌కు త్వరలో OLED డిస్ప్లేలను జోడించాలని యోచిస్తున్నట్లు గతంలో నివేదికలు వచ్చాయి. ఇందులో ఐప్యాడ్ ఎయిర్ , ఐప్యాడ్ మినీ వెర్షన్‌లు రెండూ ఉన్నాయి. 2029 నాటికి OLED టాబ్లెట్‌ల డిమాండ్ 30 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా.
ఐప్యాడ్ మినీ వెర్షన్‌ల కోసం శామ్‌సంగ్ ఇప్పటికే కొత్త 8-అంగుళాల డిస్‌ప్లే నమూనాను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. 2026 నాటికి ఆపిల్ తన ఐప్యాడ్ లైనప్‌ను OLED టెక్నాలజీతో అప్‌డేట్ చేస్తుందని ఇటీవలి నివేదిక సూచిస్తుంది. 2031 నాటికి OLED ప్యానెల్‌ల డిమాండ్ 60 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా వేస్తుంది.