AP CM Chandra babu, Deputy CM Pawan Kalyan: నిన్న ఆసియాలోనే అత్యంత సంపన్నమైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల వివాహ వేడుక అది. దేశవిదేశాల నుంచి వచ్చిన అతిథులు.. సెలబ్రిటీలు.. కుటుంబసభ్యులు.. అందరి మధ్య జూలై 12 రాత్రి వీరి వివాహ మహోత్సవం జరిగింది. ఈ ఉత్సవాన్ని దేశీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా ప్రత్యేకంగా కవర్ చేశాయి. దీనికి ఎంతో మంది ప్రముఖ దేశ విదేశ సెలబ్రిటీలు హాజరయ్యారు. దాదాపు పదిరోజులుగా సాగుతున్న పెళ్ళి వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీలో సందడి చేశారు. నిన్న జరిగిన పెళ్ళికి టాలీవుడ్ నుంచి వెంకటేష్, రానా, మహేష్ బాబు, రాంచరణ్ తదిరులు హాజరయ్యారు. తమిళనాడు నుంచి రజనీకాంత్ కూడా వచ్చారు.
ఇక ఇవాళ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల శుభ్ ఆశీర్వాద్ వేడుక జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా హాజరయ్యారు. వారితో పాటూ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. వీరితో పాటూ రామ్ చరణ్ దంపతులు కూడా శుభ్ ఆశీర్వాద్ వేడుకకు వెళ్ళారు. బాబాయ్ పవన్ కల్యాణ్ వెనుకనే రామ్ చరణ్ కనిపించారు. దీంతో బాబాయ్ వెనుకనే అబ్బాయ్ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.
Also Read:Tennis: వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న బార్బోరా క్రెజ్‌సికోవా