AP CM Chandra babu, Deputy CM Pawan Kalyan: నిన్న ఆసియాలోనే అత్యంత సంపన్నమైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల వివాహ వేడుక అది. దేశవిదేశాల నుంచి వచ్చిన అతిథులు.. సెలబ్రిటీలు.. కుటుంబసభ్యులు.. అందరి మధ్య జూలై 12 రాత్రి వీరి వివాహ మహోత్సవం జరిగింది. ఈ ఉత్సవాన్ని దేశీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా ప్రత్యేకంగా కవర్ చేశాయి. దీనికి ఎంతో మంది ప్రముఖ దేశ విదేశ సెలబ్రిటీలు హాజరయ్యారు. దాదాపు పదిరోజులుగా సాగుతున్న పెళ్ళి వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీలో సందడి చేశారు. నిన్న జరిగిన పెళ్ళికి టాలీవుడ్ నుంచి వెంకటేష్, రానా, మహేష్ బాబు, రాంచరణ్ తదిరులు హాజరయ్యారు. తమిళనాడు నుంచి రజనీకాంత్ కూడా వచ్చారు.
పూర్తిగా చదవండి..Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్ళిలో ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి వేడుకల్లో ఆంధ్రా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు భాగమయ్యారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరయిన చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలు నూతన దంపతులను ఆశీర్వదించారు.
Translate this News: