Aparna Das : ఎట్టకేలకు ప్రియుడితోనే మూడుముళ్లు వేయించుకున్న నటి.. పెళ్లి ఫొటో వైరల్!

స్టార్ నటులు అపర్ణా దాస్, దీపక్ పరమా ఎట్టకేలకు ఒక్కటయ్యారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ బుధవారం సన్నిహతుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు. నచ్చినవాడితో ఏడు అడుగులు వేసినట్లు చెబుతూ పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకుంది అపర్ణ.

Aparna Das : ఎట్టకేలకు ప్రియుడితోనే మూడుముళ్లు వేయించుకున్న నటి.. పెళ్లి ఫొటో వైరల్!
New Update

Marriage Photo Viral : కోలీవుడ్ బ్యూటీ(Kollywood Beauty) అపర్ణా దాస్(Aparna Das) ఎట్టకేలకు ఓ ఇల్లాలు అయింది. నటుడు, ప్రియుడు దీపక్ పరమాతో మూడుముళ్లు వేయించుకుంది. బుధవారం వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇటీవలే హల్దీ వేడుక, సంగీత్ సెలబ్రేషన్స్ కు సంబంధించి ఫొటో, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకున్న నటి.. తాజాగా నచ్చినవాడితో ఏడు అడుగులు వేసినట్లు చెబుతూ పెళ్లి ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం మ్యారేజ్ పిక్స్(Marriage Pics) వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇక దళపతి విజ‌య్ 'బీస్ట్' సినిమాతో భారీ గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా.. తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా వచ్చిన 'ఆదికేశవ' చిత్రంలోనూ కీల‌క పాత్ర నటించి ప్రేక్షకులను మెప్చించింది.

ఇది కూడా చదవండి: Sreeleela: తండ్రి వయసున్న వ్యక్తితో శ్రీలీల సరసాలు.. ఇండస్ట్రీలో గుసగుసలు!

#deepak-parama #aparna-das #marriage
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe