Bhringraj Benefits: ఆయుర్వేదంలో అపర సంజీవని భృంగరాజు..నూనెతో అద్భుత ప్రయోజనాలు నేటి కాలంలో జట్టు రాలడం, చుండ్రు సమస్యలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. భృంగరాజు ఆకుల నూనెను వాడితే జుట్టు పెరగుతుంది. చుండ్రు నివారిణి, మంచి నిద్ర, చర్మ సమస్యలకు, పిత్త దోషాల నివారణకు ఈ తైలం చాలా బాగా పని చేస్తుంది. By Vijaya Nimma 07 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Bhringraj Benefits: నేటి కాలంలో జట్టు రాలడం, చుండ్రు సమస్యలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే.. భృంగరాజు ఆయుర్వేదంలో గొప్ప సంజీవనిగా చెప్పుకునే ఆకుల నూనెను వాడితే జుట్టు పెరగడానికి, పిత్త దోషాల నివారణకు ఈ తైలాన్ని చాలా మంచిది అంటున్నారు. భృంగరాజును మూలికల్లో రారాజు అంటారు. ఈ మొక్క ఎక్కువగా భారత్, బ్రెజిల్, థాయ్‌లాండ్ దేశాల్లో కనిపిస్తాయి. మరి బృంగరాజ్ ఆయిల్‌తో కలిగే అద్భుతమైన ఉపయోగాలు, దుష్ఫలితాలేంటో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. భృంగరాజు ఆకులు వలన కలిగే ఉపయోగాలు: జుట్టు పెరుగుదల: భృంగరాజ ఆకులను కొబ్బరి, బాదం, నువ్వుల నూనెలతో కలిపి తైలం తీస్తారు. ఈ నూనెను వాడితే జుట్టు కుదుళ్ల ఆరోగ్యం ఉంటాయి. అంతేకాదు ఇందులోని విటమిన్-ఇ జుట్టు రాలిపోవడాన్ని అరికట్టి.. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. చుండ్రు నివారిణి: తలలో చుండ్రు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఒక్కసారి అంటుకుందంటే వదిలించుకోవడం ఎంతో కష్టం. భృంగరాజ తైలంలో ఉండే యాంటీమైక్రోబియల్, యాంటీఫంగల్ గుణాలు చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. నెమ్మదించే నెరుపు: భృంగరాజ తైలం వాడితే జుట్టు నెరిసే క్రమాన్ని తగ్గిస్తుంది. ఈ తైలంలో కేశాలను నల్లబరిచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి నిద్ర: భృంగరాజ తైలం తలకు పట్టుకుంటే కండరాలకు రిలాక్సేషన్ లభిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం మంచి నిద్ర వచ్చేలా చేస్తుంది. చర్మ సమస్యలకు చెక్: భృంగరాజ మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. దీన్ని రోజూ చర్మానికి మర్దన చేస్తే డెర్మటైటిస్, సోరియాసిస్, మొటిమలు లాంటి సమస్యలకు మంచి ఫలితాలుంటాయి. అయితే ..భృంగరాజ తైలాన్ని రుద్దినప్పుడు కొందరిలో మంటగా ఉంటుంది. భృంగరాజు ఆకుల్ని తింటే మూత్రం ఎక్కువైయ్యే అవకాశం ఉంది. అందుకని గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఈ ఆకులకు దూరం ఉండాలని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ఇకా అరోగ్యానికి సంబంధించి ఏవైనా సమస్యలంటే మంచి వైద్యుని సంప్రదిస్తే మంచిది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: చికెన్, మటన్ సూప్‌లతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..? #health-benefits #bhringraj మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి