AP : నేడు ఏపీ కొత్త టెట్ నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే! ఏపీలో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. By Bhavana 01 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP TET Notification : ఏపీ (Andhra Pradesh) లో టెట్ (TET) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. ఈ వినతులు మేరకు ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఏపీ టెట్ 2024 (AP TET 2024) ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం http://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో ఉంచామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. షెడ్యూల్, నోటిఫికేషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ లతో పాటు సిలబస్ వివరాలన్నింటిని కూడా వెబ్ సైట్ లో పెట్టినట్లు వివరించారు. పరీక్షలు అన్ని కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతాయని అధికారులు వివరించారు. మెగా డీఎస్సీ (Mega DSC) కోసం మరోసారి టెట్ పరీక్షను నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. డీఎస్సీతో పాటు టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు 286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు 132 ఉద్యోగాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదంతా ఇలా ఉంటే...టెట్ లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడంతో పాటు, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఉద్యోగాల కోసం వెయిట్ చేసే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Also read: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! #ap-tet-2024 #mega-dsc #ap-tet-notification #tet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి