Ap,Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్, పొంచి ఉన్న మరో అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో (Telangana, Ap) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నాలుగు రోజుల నుండి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రాజెక్టుల వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తివేస్తున్నారు అధికారులు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

Ap,Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్, పొంచి ఉన్న మరో అల్పపీడనం
New Update

ap telangana rain alert

కుండపోతగా కురుస్తున్న వర్షాలకు తెలుగురాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. నాలుగు రోజుల నుండి పడుతున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరింది. ఇప్పటికే లోతట్టు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాజెక్టుల వద్దకు వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తివేస్తున్నారు. వరద పొటెత్తుతున్న కారణంగా ఆ ప్రాజెక్టుల వద్ద పరిస్థితి ఆందోళగా మారింది. జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇదే సమయంలో ఇరు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురస్తూనే ఉన్నాయి.

తెలంగాణలో విస్తారంగా వర్షాలు

వానలు ఎప్పుడు తగ్గుతాయిరా బాబు అనుకుంటున్న సమయంలో భారత వాతావారణ శాఖ (Weather Report) మరో పిడుగులాంటి వార్తను తెలిపింది. మరో అల్పపీడనం పొంచి ఉందని హెచ్చరిస్తోంది. దీంతో మరో నాలుగు, ఐదు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఈనెల 24న మరో అల్పపీడనం పొంచి ఉందని ఐఎండీ (IMD) పేర్కొంది. రాబోయే ఐదురోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్‌

వర్షాల కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు హై అలర్ట్‌ను (High Alert) ప్రకటించాయి. తెలంగాణలో (Telangana) 13 జిల్లాలకు అరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. మిగిలిన జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్‌లలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.

ఏపీలోనూ వర్షాలు

ఇక మరోవైపు ఏపీలోనూ (AP) వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురవనుండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం (Ap Govt) ప్రజలను కోరింది. ఇక.. గోదావరి ముంపు గ్రామాలు కొన్ని ఇప్పటికే ఇళ్లను ఖాళీ చేసిన ప్రజలు తలదాచుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప..మత్స్యకారులు( Fishermen) సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

#telangana #heavy-rains #telangana-rains #andrapradesh #ap-rains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe