Insta Murder : యువకుడి ప్రాణంతీసిన ఇన్‌స్టా చాటింగ్.. మర్మాంగాలపై కొట్టి కొట్టి

ఏపీ శ్రీకాకుళంలో దారుణం జరిగింది. వివాహిత రమ్య, రమేష్‌కు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడి సన్నిహితంగా చాటింగ్ చేసుకున్నారు. విషయం గమనించిన రమ్య భర్త సంతోష్‌.. మాట్లాడుకుందామని పిలిచి ఆరుగురితో కలిసి రమేష్ ను మర్మంగాలపై కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Insta Murder : యువకుడి ప్రాణంతీసిన ఇన్‌స్టా చాటింగ్.. మర్మాంగాలపై కొట్టి కొట్టి

Srikakulam : సోషల్ మీడియా (Social Media) పరిచయం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇన్‌స్టా ద్వారా పరిచయమై చాలా సన్నిహితంగా చాటింగ్ చేసిన ఓ వివాహిత నేరుగా మాట్లాడుకుందామని నమ్మించి పిలిచి తన భర్తతో అతన్ని దారుణంగా హతమార్చింది. శ్రీకాకుళం జిల్లా కేవరాయపురం గ్రామంలో జరిగిన ఈ సంఘటన తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపుతుండగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మాట్లాడుకుందాం రమ్మని నమ్మించి..
ఈ మేరకు కేవరాయపురం గ్రామానికి చెందిన సంతోష్, రమ్య భార్యభర్తలు. అయితే సీతంవలస గ్రామానికి చెందిన ధర్మాన రమేష్, రమ్యకు ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త క్లోజ్ చాటింగ్ వరకు వెళ్లింది. ఈ విషయం గమనించిన రమ్య భర్త సంతోస్.. కోపంతో రగిలిపోయాడు. భార్యతో రమేష్ చాటింగ్ చేయడాన్ని తట్టుకోలేపోయాడు. ఈ క్రమంలోనే ఎలాగైన రమేష్‌ ను ఖతం చేయాలనుకున్నాడు. దీంతో మాట్లాడుకుందాం రమ్మని తన భార్య రమ్యతో పిలిపించాడు. గుడ్డిగా నమ్మి వచ్చిన రమేష్ ను మరో ఆరుగురితో కలిసి దాడిచేశారు సంతోష్. రమేష్ మర్మాంగాలపై కొట్టి కొట్టి అతికిరాకంగా హతమార్చారు.

చెట్టుకు ఉరేసుకున్నట్లు అందరినీ నమ్మించి..
అనంతరం రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. రమేష్ తన స్వగ్రామంలోనే చెట్టుకు ఉరేసుకున్నట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో రమేష్‌ది ఆత్మహత్యగా ధ్రువీకరించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే రమేష్ మరణంపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు మరోసారి పోలీసులను సంప్రదించారు. దీంతో వారి ఫిర్యాదు స్వీకరించి సీసీ పుటేజిని పరిశీలించగా హత్య ఉదంతం బయటపడింది. రమేష్‌తో రమ్య భర్త సంతోష్ కలిసి ఉన్న సీసీ ఫుటేజీ సేకరించారు. వాటి ఆధారంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రమ్య, భర్త సంతోష్, వారికి సహకరించిన ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. డీఎస్పీ నేతృత్వంలో కేసును రీఓపెన్ చేయించి దర్యాప్తు చేయాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు