AP Skill Survey: దేశంలోనే తొలిసారిగా మంగళగిరిలో స్కిల్ సర్వే.. ఎలాంటి వివరాలు సేకరిస్తారంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్య గణన నిర్వహించేందుకు సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నైపుణ్య గణన ఏపీలో జరుగుతోంది. దీనిని మొదటగా సెప్టెంబర్ 3న మంగళగిరిలో నిర్వహించనున్నారు.

New Update
AP Skill Survey: దేశంలోనే తొలిసారిగా మంగళగిరిలో స్కిల్ సర్వే.. ఎలాంటి వివరాలు సేకరిస్తారంటే?

Ap Skill Survey: రాష్ట్రంలో యువత ఉపాధి కల్పన కోసం నైపుణ్య గణన సర్వే చేయాలని గత క్యాబినెట్లో ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కసరత్తులను చేసింది. పైలెట్ ప్రాజెక్టుగా మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంది కూటమి ప్రభుత్వం. వచ్చే నెల మూడు నుంచి సర్వే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఒక యాప్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ద్వారా సమాచారాన్ని సేకరించి దానిని విశ్లేషిస్తారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారం దాదాపు 20 ఏళ్ళ పాటు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సర్వే ద్వారా ఎవరికి ఏ డొమైన్‌లో నైపుణ్య శిక్షణ అవసరమో గుర్తించిన అనంతరం నైపుణ్య కళాశాలలు, హబ్‌లు, కొత్తగా కళాశాలలు, యూనివర్సిటీల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. దీని తర్వాత అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. అంతేకాక విద్యార్ధులకు అభ్యర్ధులకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో కంపెనీల నుంచి సైతం వివరాలు తీసుకోనున్నారు. దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి.. కంపెనీలకు అనుసంధానం చేస్తారు.

ఇక నైపుణ్య గణనను గ్రామవార్డు సచివాలయ సిబ్బంది చేత చేయించనున్నారు. దీని కోసం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. వీరికి ఈ నెల 23, 24, 30, 31న రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబుల ద్వారా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. 25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తారు. అక్షరాస్యులు? నిరక్షరాస్యులు? ఉద్యోగులు? చదువుకుని ఉద్యోగం రాని వారు? ఉద్యోగం సంఘటిత రంగమా? అసంఘటిత రంగమా? నిరుద్యోగుల విద్యార్హతలు? పీహెచ్ఎ, ఎంఎస్, డిగ్రీ, ఇంటర్మీడి యట్, పదో తరగతి, ఎనిమిదో తరగతి? బీటెక్ చదివితే డొమైన్ నాలెడ్జ్ ఉందా? ఇలా 25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరి స్తారు. సంఘటిత రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి పీఎఫ్ ఖాతాలు, అసంఘటిత రంగంలో ఉంటే ఈ-శ్రమ్ ద్వారా వివరాలు తీసుకోనున్నారు.
మొత్తం సర్వే నిర్వహించడానికి ఒక్కో నియోజకవర్గానికి నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: Andhra Pradesh: అలర్ట్..గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష వాయిదా

Advertisment
తాజా కథనాలు