AP Elections 2024: వారిని ఓటుకు అనుమతించకూడదు.. సీఈవోకు వైసీపీ మినిస్టర్స్ ఫిర్యాదు! డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ మంత్రులు. ఏపీ, హైదరాబాద్‌లో రెండు చోట్లా 4,30,264 ఓట్లు ఉన్నాయని CEO మీనాకు మంత్రులు జోగి రమేశ్, వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ లో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. By Trinath 06 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి చాలా మందికి హైదరాబాద్(Hyderabad)లో ఓటు ఉండి కూడా వెయ్యలేదన్న విషయం తెలిసిందే. ప్రతీసారి ఎన్నికల్లో హైదరాబాద్ నుంచే తక్కువ ఓటింగ్ శాతం నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తక్కువ ఓటింగ్ శాతానికి కేవలం భాగ్యనగర వాసుల బద్ధకం ఒక్కటే కారణం కాదు.. అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని తెలుస్తోంది. రూల్స్ ప్రకారం ఒక చోట ఓటర్ కార్డ్(Voter Card) ఉన్నవాళ్లకి వేరే చోట ఉండకూడదు. ఇక ఏపీ(AP)కి చెందిన చాలామంది హైదరాబాద్‌లో సెటిలై ఉంటారు. జాబ్ కోసం భాగ్యనగరానికి వచ్చి అక్కడే స్థిరపడిపోతారు. పనిలోపనిగా ఓటర్ కార్డ్‌కు కూడా అప్లై చేసుకుంటారు. కానీ సొంతేరిలో ఉన్న ఓటును రద్దు చేయించుకోరు.. అధికారులు కూడా పట్టించుకోరు. తెలంగాణ ఎన్నికల వేళ ఈ ఆసక్తికర విషయం బయటపడింది. ఇక నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో డబుల్ ఎంట్రీ ఓట్లుపై ఏపీ మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వారు ఓటు వేయకూడదు: తెలంగాణ ఫలితాలు వెలువడని మూడో రోజే ఏపీ మంత్రులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాను కలవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మంత్రులు జోగి రమేశ్, వేణుగోపాల్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర నేతలు సీఈవోను కలిశారు. తెలంగాణలో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మంత్రి జోగి రమేశ్ ఏం అన్నారంటే: ➼ హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ➼ ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందించాం. ➼ డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం. ➼ దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం. ➼ ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం ➼ చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళి ఏం ఫిర్యాదు చేస్తారు? మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఏం అన్నారంటే? ➼ ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. ➼ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. ➼ మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా. ➼ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి. ➼ టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది. ➼ డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. ➼ చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారు. ➼ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. Also Read: డీప్ ఫేక్ బారిన మీరు పడ్డారా? ఈ వెబ్‌సైట్ తో దాని నుంచి బయటపడండి WATCH: #ap-elections-2024 #telangana-elections-2023 #jogi-ramesh #general-elections-2024 #ap-voters #ceo-meena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి