AP Politics-Pushpa: బీజేపీలోకి 'పుష్ప'.. ఏపీ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామం!

ఏపీ పాలిటిక్స్ లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. పుష్ప నేడు బీజేపీలో చేరనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. పుష్ప ఏంటి? బీజేపీలో చేరడం ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే.. RTV అందిస్తున్న ఈ Exclusive స్టోరీ చదివేయండి.

New Update
AP Politics-Pushpa: బీజేపీలోకి 'పుష్ప'.. ఏపీ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామం!

ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే చాలు.. మీడియాలో ఫస్ట్ వినపడే పేరు కొల్లం గంగిరెడ్డి. అసలు పుష్ప లో హీరో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడం.. ఆ దుంగలను చెక్ పోస్టులను దాటించడం.. ఆ సీన్ లు అన్నీ ఈయనపై నమోదైన కేసుల నుంచే తీసుకున్నారన్న టాక్ కూడా ఉంది. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గా ఆయనకు పేరు. పెద్దల సహకారంతో, వ్యవస్థలను మేనేజ్ చేసి వేల కోట్ల విలువైన ఎర్ర చందనాన్ని గంగిరెడ్డి జిల్లాలు.. రాష్ట్రాలే కాదు.. ఏకంగా దేశాలే దాటించాడని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు అంచనాలకు అందని విధంగా ఎర్ర చందనాన్ని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. స్మగ్లింగ్ కు సంబంధించి గంగిరెడ్డిపై మొత్తం 26కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇంకా ఆయన కడప, తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాల్లో ఆయన ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తాన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇంతటితో ఆగకుండా పాలిటిక్స్ లోనూ గంగిరెడ్డికి ప్రవేశం ఉంది. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో మండలంలో ఆయన వైసీపీ కీలక నేతగా ఉన్నారు.

చంద్రబాబుపై అలిపిరి దాడి కేసులో కీలక నిందితుడు..
అలిపిరిలో చంద్రబాబుపై బాంబుదాడి కేసులోనూ గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఓ పారిశ్రామికవేత్త హత్యలోనూ ఆయన కీలక నిందితుడు. దీంతో నకిలీ పాస్ పోర్ట్ తో ఆయన దేశం విడిచి పారిపోయాడు. దుబాయ్, మలేషియా, సింగపూర్‌, శ్రీలంకలో ఆయన తలదాచుకున్నాడు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. గంగిరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన ఆచూకీ కోసం ఇంటర్ పోల్ ను సైతం ఆశ్రయించారు. దీంతో గంగిరెడ్డిపై రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ అయ్యింది. ఎట్టకేలకు 2015లో మారిషస్ లో ఆయనను పట్టుకుని ఏపీకి తీసుకొచ్చారు. దీంతో 2015 నుంచి 2019 వరకు కడప జైల్ లో ఉన్న గంగిరెడ్డి.. 2019 తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అనంతరం పాలిటిక్స్ లో యాక్టీవ్ అయ్యారు

ఇటీవల మరో కేసులో...
ఏపీలో ప్రభుత్వం మారినా.. గంగిరెడ్డి మాత్రం తన దందాలు ఆపలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ థియేటర్ స్థల వివాదంలో జోక్యం చేసుకోవడంతో మదనపల్లి పోలీసులు ఆయనను ఈ నెల 26న విచారణకు పిలిచారు. డీఎస్పీ కార్యాలయంలో రాత్రంతా విచారించి మరుసటి రోజు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. మరోసారి స్థల వివాదాల్లో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని గంగిరెడ్డికి ఎస్పీ వార్నింగ్ కూడా ఇచ్చారు.

నేడు బీజేపీలోకి..
ఇన్నాళ్లూ కడప వైసీపీలో కీలక నేతగా ఉన్న గంగిరెడ్డి.. అనూహ్యంగా బీజేపీలో చేరడానికి సిద్ధం కావడం ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది. ఇందుకు బీజేపీ రాష్ట్రనాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ రోజు పురంధేశ్వరి సమక్షంలో ఆయన పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే.. పార్టీ బలోపేతం కోసమే ఈ చేరికలు అని నాయకత్వం చెబుతుండగా.. అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ గా పేరున్న వ్యక్తిని చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం మరికొందరి నేతల్లో వ్యక్తం అవుతోంది. మరోవైపు చంద్రబాబుపై జరిగిన అలిపిరి బాంబ్ బ్లాస్ట్ లో కీలక నిందితుడిని చేర్చుకుంటే.. టీడీపీ ఎలా స్పందిస్తుందనే అంశంపై సైతం ఏపీ పాలిటిక్స్ లో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే గంగిరెడ్డి బీజేపీలోకి చేరుతున్నాడన్న చర్చ కూడా సాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు