AP Politics: పురందేశ్వరి పేరుకే బీజేపీ అధ్యక్షురాలు.. చంద్రబాబు జేబులోకి ఎన్ని కోట్లంటే: సజ్జల సంచనల వాఖ్యలు

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యవహిస్తున్న తీరు టీడీపీ అధ్యక్షురాలి మాదిరిగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ స్కామ్ ను 2018 లోనే జీఎస్టీ వాళ్లు బయటకు తెచ్చారన్నారు.

AP Politics: పురందేశ్వరి పేరుకే బీజేపీ అధ్యక్షురాలు.. చంద్రబాబు జేబులోకి ఎన్ని కోట్లంటే: సజ్జల సంచనల వాఖ్యలు
New Update

పురందేశ్వరి (Daggubati Purandeswari) పేరుకే బీజేపీ అధ్యక్షురాలు కానీ.. ఆమె వ్యవహరిస్తున్న తీరు మాత్రం టీడీపీ అధ్యక్షురాలిలా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishnareddy) ఆరోపించారు. పురందేశ్వరి డిల్లీ వెళ్లి చంద్రబాబు ను విడిపించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె బీజేపీకి అధ్యక్షురాలిగా ఉండి టీడీపీ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం అంటూ పురంధరేశ్వరి డిల్లీ వెళ్లి చంద్రబాబు కోసం మాట్లాడారన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టుకు కక్ష సాధింపు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. 2018 లోనే ఈ స్కాం ను జీఎస్టీ వాళ్లు బయటకి తెచ్చారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండి ఈ స్కామ్ లో రూ.300 కోట్లు నేరుగా తన జేబులోకి వేసుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈకేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని నిరూపించుకున్నాకే చంద్రబాబు అరెస్టు జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి: Big Breaking: చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట.. అప్పటివరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు!

ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిందన్నారు. కోర్టుల్లో చంద్రబాబు లాయర్లు ప్రోటోకాల్ పాటించలేదు అని మాత్రమే అంటున్నారు కానీ.. స్కాం గురించి మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబు లాయర్లు నెల రోజుల నుంచి క్వాష్ పిటిషన్ పైనే కేసును నడిపిస్తున్నారన్నారు. ఇది చంద్రబాబు విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నమే తప్పా.. తప్పు జరగలేదని చెప్పడం లేదన్నారు. చంద్రబాబు అవినీతి, దోపిడీని ప్రజలు గమనించారన్నారు. అసలు అమరావతే పెద్ద కుట్ర అని.. తద్వారా వేల కోట్ల స్కాం కు టీడీపీ నేతలు ప్లాన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు సజ్జల.

చంద్రబాబు అండ్ కో అనుకున్నది జరిగి ఉంటే లక్షల కోట్లు స్కాం జరిగేదన్నారు. హెరిటేజ్ కంపెనీకి అక్కడే ఎందుకు భూములు కొన్నారని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు వద్దకు ములాఖత్ కు వెళ్లిన వారు.. ఒకసారి డీహైడ్రేషన్ అంటున్నారు.. మరోసారి ఫుల్ జోష్ లో ఉన్నారు అంటున్నారని ఎద్దేవా చేశారు. దోమలు అన్నారు.. మావోయిస్టులు బెదిరింపులు అన్నారు.. మళ్ళీ డీహైడ్రేషన్ అంటున్నారన్నారు. జైలులో చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత ఉందన్నారు. వయసు దృష్ట్యా ఆయనను బాగానే చూసుకుంటున్నారన్నారు.

#purandeshwari #sajjala-ramakrishna-reddy #chandrababu-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe