/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/JAGAN-VINUKONDA.jpg)
YS Jagan To Vinukonda: వినుకొండ వెళుతున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కాన్వాయ్ పై పోలీసులు ఆంక్షలు పెట్టారు. వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకున్నారు. వైయస్ జగన్ తో పాటు వినుకొండ బయలుదేరిన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ నేతల కార్లు వైయస్ జగన్ వెంట వెళ్లకుండా నియంత్రించారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో పార్టీ నేతల వాహనాలను పోలీసులు ఆపేశారు. ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన పోలీసులు సరిగ్గా నడవని బీపీ వాహనం బాగోకపోవడంతో ప్రైవేట్ వాహనం లో వినుకొండ వెళ్తున్నారు వైయస్ జగన్. పోలీసులు తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
వినుకొండ వెళ్తున్న వైయస్ జగన్ గారి కాన్వాయ్ లోని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని ఆపేస్తున్న పోలీసులు. pic.twitter.com/lN5rQpUUp9
— YSR Congress Party (@YSRCParty) July 19, 2024