YS Sharmila: సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ షర్మిల సంచలన ట్వీట్

AP: వివేకా హత్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు షర్మిల. అధికార బలాన్ని ఉపయోగించి, మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెట్టు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం తొలి అడుగు మాత్రమే అని అన్నారు.

New Update
YS Sharmila: సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ షర్మిల సంచలన ట్వీట్

YS Sharmila Tweet On CM Jagan: మాజీ మంత్రి వివేకా హత్య ( Viveka Murder Case) గురించి మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు షర్మిల, సునీతకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ షర్మిల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం కడప కోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని... వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా కడప కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

Also Read: ఈ నెల 23 వరకు తెలంగాణ, ఏపీలో అతిభారీ వర్షాలు

కాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై షర్మిల హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ ఆమె ట్విట్టర్ (X) లో విమర్శల దాడికి దిగారు. ఆమె ట్విట్టర్ లో.." దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా, వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. భావప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షసమూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి, ఎప్పటికైనా ధర్మపోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ ఐంది. అధికార బలాన్ని ఉపయోగించి, మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెట్టు.ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో, వివేకకానంద రెడ్డి గారి కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తాము. చిట్టిచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం." అని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు