షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ రాజకీయాల్లో యాక్టీవ్ కానున్నారన్న ప్రచారం సాగుతున్న వేళ ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు (AP PCC Chief Rudraraju) సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తున్నట్లు తన వద్ద అధికార సమాచారం ఉందన్నారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ తనకు ఈ విషయం స్వయంగా చెప్పినట్లు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాంటలో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొంటారని చెప్పారు.
ఇది కూడా చదవండి: న్యూ ఇయర్ వేళ ముద్రగడ ఇంటికి భారీగా కాపు నేతలు.. వైసీపీలోకి వెళ్లడం ఖాయమైనట్లేనా?
ఇంకా అమరావతి, పోలవరం కోసం జరిగే పోరాటంలో ప్రియాంకా గాంధీ పాల్గొంటారని వెల్లడించారు. ఇంకా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమకు టచ్ లో ఉన్నారని ప్రకటించారు. వారి చేరికలు త్వరలోనే ఉంటాయన్నారు. రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధమైందన్నారు.
కర్ణాటక, ఏపీ రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా రాష్ట్రానికి వస్తారన్నారు. వారందరి సహకారంతో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. వైసీపీ, టీడీపీ పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలకు కాంగ్రెస్ మాత్రమే సరైన ప్రత్యామ్నాయమన్నారు.