టీడీపీ పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంది.. ఎంపీ భరత్ హాట్ కామెంట్స్!

టీడీపీపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ భారత్. టీడీపీ పవన్ కళ్యాణ్ ను నమ్ముకుందని అన్నారు. లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

New Update
టీడీపీ పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంది.. ఎంపీ భరత్ హాట్ కామెంట్స్!

Lokesh Yuvagalam: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu) అరెస్ట్ తో ఆగిపోయిన యువగళం (Yuvagalam) పాదయాత్రను నారా లోకేష్ (Lokesh) తిరిగి చేపట్టారు. ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపేందుకు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై వైసీపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ (MP Bharath) సెటైర్లు వేశారు.

ALSO READ: మందు బాబులకు ALERT.. ఈరోజు నుండి వైన్స్ బంద్!

ఆయన మాట్లాడుతూ.. లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో అర్ధం కావటం లేదంటూ విమర్శలు చేశారు. మిడ్ నైట్ కూడా పాదయాత్ర చేస్తున్నాడు, పాదయాత్ర చేస్తూ రన్నింగ్ చేస్తున్నాడని అన్నారు. ఆది పాదయాత్రలా లేదు.. జోక్ యాత్రలా ఉందని సెటైర్లు వేశారు. తమ పాదయాత్రను వైసీపీ ప్రభుత్వం ఆపాలని చూస్తుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. పాదయాత్ర ఆపవలసిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు.

వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బటన్ నొక్కడం ద్వారా అన్ని వర్గాల వారు డైరెక్ట్ బెనిఫిట్స్ పొందారని అన్నారు. మా నాయకుడు జగన్ ఒకటే చెపుతున్నారు.. అన్ని వర్గాల వారికి మేలు జరుగితేనే మాకు ఓటు వెయ్యండి అని ధైర్యంగా చెబుతున్నారని అన్నారు.

లోకేష్ ఎందుకు పాదయాత్ర ఆపాడు.. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడైనా సింపతీ కోసమైనా పాదయాత్ర చెయ్యాలి కదా అని ప్రశ్నించారు. వీళ్ళంతా రాజకీయంగా ఎదో చెయ్యాలని చేస్తూరు తప్పా క్లారిటీ లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ పై ఆధారపడి టీడీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న మంచి చేసాడు.. రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేస్తాడని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: ఎంఐఎం ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తోంది: రాహుల్ సంచలన వ్యాఖ్యలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు