Minister Roja: లోకేష్ ఎప్పుడైనా అలా చేశావా?: మంత్రి రోజా సంచలన వాఖ్యలు

టీడీపీ నేత నారా లోకేశ్ కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని రాష్ట్రపతిని కోరారని మంత్రి రోజా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేశ్‌ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ ఎద్దేవా చేశారు.

Minister Roja: లోకేష్ ఎప్పుడైనా అలా చేశావా?: మంత్రి రోజా సంచలన వాఖ్యలు
New Update

విజయవాడలో బుధవారం మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ (TDP Leader Nara lokesh) ఎప్పుడైనా రాష్ట్రపతిని కలిశారా? అని ప్రశ్నించారు. అలాంటి దాఖలాలే లేవని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ( (PM Modi), అమిత్‌షా (Amit shah) కాళ్ళు పట్టుకోవడానికి తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. అందుకే మోదీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్కిల్ డెవెలప్‌మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని రోజా (Minister RK Roja) గుర్తు చేశారు.

This browser does not support the video element.

రిటర్న్ గిఫ్ట్ అంటే అందరూ నవ్వుతున్నారు

ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు కదా.. ఇంకా స్కాం ఎలా జరిగిందని లోకేష్ అడుగుతున్నారు.రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్ పేరుతో దోచుకున్నారు. ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారని రోజా అన్నారు. స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయారని రోజా ఎద్దేవా చేశారు. కాళ్ళ నుంచి కళ్ళ వరకూ భయంతో వణికిపోతున్నారన్నారు. ఎర్రబుక్‌లో రసుకుంటానని బెదిరిస్తున్న లోకేష్.. సీఐడీ మెమోలో ఆయన పేరు రాసారని గుర్తుచేసుకోవాలని వ్యాఖ్యానించారు. హెరిటేజ్‌లో 2 శాతం షేర్లు అమ్మితెనే 400కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారు.. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా..? అంటూ ప్రశ్నించారు.

ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం పోతోంది

చంద్రబాబు నాయుడు అఫిడవిట్‌లో ఆ విషయం స్పష్టం చేశారా..? అని నిలదీశారు మంత్రి రోజా. కర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం ఇచ్చారు. అక్కడి నుంచి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగింది..? అని రోజా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఇల్లు 600 కోట్లు.. భువనేశ్వరి లోకేష్ 118 కోట్ల అయితే నోటీసులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా ఈ స్కాంలను తెల్సుకోవాలని మంత్రి రోజా విజ్ఞప్తి చేశారు. భువనేశ్వరి, బ్రహ్మణి (Nara Bhuvaneshwari, Brahmini) అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందన్నారు. చంద్రబాబు దోపిడీదారుడని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు టీమ్ వర్క్‌గా కుటుంబ సభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైందని రోజా అన్నారు.

ఇది కూడా చదవండి: మద్యం తాగి నిమజ్జనానికి రావొద్దు.. 25 వేల మందితో భారీ బందోబస్తు.. సీపీ కీలక ప్రకటన

#vijayawada #lokesh #media-conference #nara-bhuvaneshwari #minister-rk-roja #brahmini
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe