/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ambati-2-jpg.webp)
Ambati Rambabu Counter to Renu Desai : సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఈమేరకు రేణూ దేశాయ్ ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!' అని రాసుకొచ్చారు. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా రేణూ దేశాయ్ కి కౌంటర్లు ఇస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదికాస్తా వైరల్ గా మారింది.
అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు
మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని !— Ambati Rambabu (@AmbatiRambabu) August 10, 2023
కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు పదే పదే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే బ్రో ఈ సినిమా లో పృథ్వీరాజ్ పోషించిన శ్యాంబాబు అనే పాత్రను తనను ఉద్దేశించే పెట్టారంటూ గత కొద్ది రోజులుగా అంబటి రాంబాబు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
రేణూ దేశాయ్ ఏమన్నారంటే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఆయన మాజీ సతీమణి రేణూ దేశాయ్ (Renu Desai) గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిరోజు నుంచి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూనే.. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారని.. పవన్ ఓ అరుదైన వ్యక్తి అన్నారు. డబ్బు మనిషి కాదని.. అంటూ రేణూ దేశాయ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఇది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.
రాజకీయాల్లో ఆయన చేస్తున్న సేవను గుర్తించండని సూచించారు. మంచి నటుడు స్టార్ హీరోగా ఉండి కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. దయచేసిన పవన్‌కు ఒక అవకాశం ఇవ్వండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండని చురకులు అంటించారు. ఇకనైనా పవన్ మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపండన్నారు. తన పిల్లలనే మిగిలిని ఇద్దరు పిల్లలను ఈ వివాదాల్లోకి లాగకండని కోరారు.
అలాగే బ్రో సినిమాలో నెలకొన్న శ్యాంబాబు వివాదంపైనా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తెలిసిందన్నారు. ఆ వివాదం గురించి తనకు అవగాహన లేదని.. కాకపోతే పవన్ పెళ్లిళ్లపై సినిమా తీస్తామని, వెబ్ సిరీస్ చేస్తామని కొందరు అన్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఓ తల్లిగా అభ్యర్థిస్తున్న పరిస్థితుల ఏమైనా సరే దయచేసి పిల్లలను ఇందులోకి లాగకండి అంటూ రేణూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
Also Read: `భోళాశంకర్` మూవీ ట్విట్టర్ రివ్యూ…మెగాస్టార్ హిట్ కొట్టినట్లేనా..?
Follow Us