Vijayawada: విజయవాడ పార్లమెంట్ బరిలో ఈసారి అన్నదమ్ములు నువ్వా నేనా అని తలపడుతున్నారు. కేశినేని బ్రదర్స్‌లో గెలిచేది ఎవరో చూద్దాం. మొన్నటి వరకు టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థి.
నానికి పార్టీ మారడం ప్రతికూలంగా మారింది. టీడీపీలో ఉంటూ కోవర్టుగా పని చేశారనే విమర్శా ఆయనపై ఉంది. పార్టీ కన్నా తానే సుప్రీం అనే భావన మైనస్‌గా కనిపిస్తోంది. ఆర్థికంగా నాని కన్నా చిన్నిదే పైచేయి. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉండటం చిన్నికి కలిసి చ్చే అంశం.
సామాజిక సేవా కార్యక్రమాలతో రెండున్నరేళ్ల నుంచి ఆయన జనంలోనే ఉండటం ప్లస్ పాయింట్. విజయవాడ టౌన్‌లోని మూడు అసెంబ్లీ సీట్లలో చిన్నికి ఎక్కువ సానుకూలత ఉన్నట్లు మా స్టడీలో తేలింది. అదీగాక విజయవాడ పార్లమెంట్ సీటులో ఒక సంప్రదాయం ఉంది. ఏ పార్టీ వరుసగా ఇక్కడ మూడుసార్లు గెలవలేదు. వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ సానుకూలతలు ఎక్కువగా ఉన్న కేశినేని చిన్నికే విజయవాడ ఎంపీ సీటులో గెలుపు అవకాశాలున్నాయని మా స్టడీ చెబుతోంది.