AP Game Changer : ఏపీలో కాబోయే ఎంపీలు వీరే.. ఆర్టీవీ స్టడీ ఫలితాలు! ఏపీ 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆర్టీవీ ప్రత్యేకంగా చేపట్టిన స్టడీలో ఆసక్తికర రిజల్ట్స్ వెలువడ్డాయి. ఆర్టీవీ స్టడీ ప్రకారం వైసీపీ6, టీడీపీ13, జనసేన2, బీజేపీ4 స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్లు రవి ప్రకాశ్ వెల్లడించారు. పూర్తి వివరాలకోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP Lok Sabha 2024 : ఏపీ అసెంబ్లీ, లోక్ సభ 2024 ఎన్నికల ఫలితాల(Election Results) పై ఆర్టీవీ(RTV) ప్రత్యేకంగా చేపట్టిన స్టడీలో ఆసక్తికర రిజల్ట్స్ వెలువడ్డాయి. ఇప్పటికే ఎమ్మెల్యే విజేతలను ప్రకటించిన ఆర్టీవీ ఈ రోజు ఏపీలో 25 ఎంపీ స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ ను బయటపెట్టింది. వైసీపీ(YCP), టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి(TDP-Janasena-BJP Alliance) తోపాటు కాంగ్రెస్ నుంచి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే స్పష్టమైన ఫలితాలను వెల్లడించారు రవి ప్రకాశ్. ఆర్టీవీ స్టడీ ప్రకారం వైసీపీ 6, టీడీపీ 13, జనసేన 2, బీజేపీ 4 స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పుడు అందరి చూపు ఎన్నికలపైనే. టెక్నాలజీ సాయంతో ఓటింగ్, కౌంటింగ్ జరిగే ఏకైక దేశం భారత్. అంటే టెక్నాలజీ మన రాజకీయాలను శాశ్వతంగా మార్చేసిన విషయం కనిపిస్తుంది. ఇదే టెక్నాలజీతో వార్తల ప్రపంచాన్ని కూడా మార్చేస్తుంది ఆర్టీవీ. రెండు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేశాం. ఇప్పుడు ఏపీ లోక్‌సభ రిజల్ట్స్‌ను మీ ముందుకు తెస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్నాయి. ఒక్కసారి 2019 ఫలితాలను గమనిస్తే.. వైసీపీ-22, టీడీపీ-3 స్థానాలను కైవసం చేస్తున్నాయి. ఇక జనసేన, బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. అయితే ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో ఎటువంటి ఫలితం రాబోతుంది.. ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందన్న దానిపై ఆర్టీవీ స్టడీ చేసింది. వాటి వివరాలను ప్రాంతాల వారీగా తెలియజేస్తున్నాం Also Read : యువకుడికే పట్టం కడుతున్న అమలాపురం.. ఆర్టీవీ స్టడీలో తేలింది ఇదే! రాయలసీమ.. రాష్ట్రంలో కరువు పేరు చెబితే ముందుగా మనకు గుర్తొచ్చేది రాయలసీమ. నీటి వసతి లేక ఇక్కడ ఉన్న భూమిలో ఎక్కువ శాతం పంటలు పండే అవకాశం తక్కువ. రాయలసీమలో 8 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 8 లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది. ఇక 2024 ఎన్నికలకు వస్తే ఇక్కడ వైసీపీ బలం తగ్గిందన్నది మా స్టడీ రిపోర్టులో తేలింది. 8 స్థానాల్లో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయి. మిగిలిన 5 స్థానాలను కూటమి (టీడీపీ-4, బీజేపీ-1) పార్టీలు దక్కించుకోనున్నాయని మా స్టడీలో తేలింది. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, సీఎం జగన్ సోదరి వైఎష్ షర్మిల కడప లోక్‌సభ స్థానంలో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మా స్టడీలో తేలింది. కోస్తాంధ్ర రాష్ట్రానికి మధ్యలో ఉన్న 6 (ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి) జిల్లాలను కలిపి కోస్తాంధ్రగా పిలుస్తారు. ఇక్కడ విద్య, వైద్యపరంగా, వ్యవసాయపరంగా కొంత మెరుగైన పరిస్థితి ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో నీటి వసతి లేక కరువు ఛాయలు కనిపిస్తుంది. కోస్తాంధ్రలో మొత్తం 12 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ 10 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. జనసేన, బీజేపీలు ఒక్క సీటు కూడా సాధించలేకపోయాయి. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో కూటమి-11 స్థానాల్లో (టీడీపీ-7, జనసేన-2, బీజేపీ-2), వైసీపీ-1 స్థానంలో విజయం సాధించే అవకాశాలున్నాయని మా స్టడీలో తేలింది. ఉత్తరాంధ్ర రాష్ట్రంలో ఎంతో కొంత వెనుకబాటు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఒక్క విశాఖ మినహా మిగిలిన ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించదు. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో 5 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. జనసేన, బీజేపీలు ఒక్క సీటు కూడా సాధించలేదు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో కూటమి 3 స్థానాలు (టీడీపీ-2, బీజేపీ-1), వైసీపీ 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని మా స్టడీ రిపోర్టులో తేలింది. మొత్తంగా చూస్తే 25 స్థానాల్లో కూటమి - 19 (టీడీపీ-13, జనసేన-2, బీజేపీ-4) స్థానాల్లో విజయం సాధించే అవకాశాలుండగా.. వైసీపీ కేవలం 6 స్థానాలకే పరిమితం కానుంది. విజయకాశాలున్న అభ్యర్థులు నంద్యాల - పోచా బ్రహ్మానంద రెడ్డి (వైసీపీ) కర్నూలు - బస్తిపాటి నాగరాజు (టీడీపీ) అనంతపురం - అంబికా లక్ష్మీనారాయణ (టీడీపీ) హిందూపురం - బీకే పార్ధసారధి (టీడీపీ) కడప - వైఎస్ అవినాష్ రెడ్డి (వైసీపీ) తిరుపతి - గురుమూర్తి (వైసీపీ) రాజంపేట - కిరణ్ కుమార్ రెడ్డి (బీజేపీ) చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాదరావు (టీడీపీ) నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (టీడీపీ) ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి (టీడీపీ) బాపట్ల - తెన్నేటి కృష్ణప్రసాద్ (టీడీపీ) నరసరావుపేట - శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ) విజయవాడ - కేశినేని చిన్ని (టీడీపీ) మచిలీపట్నం - బాలశౌరి (జనసేన) ఏలూరు - కారుమూరి సునీల్ (వైసీపీ) నరసాపురం - భూపతిరాజు శ్రీనివాస్ వర్మ (బీజేపీ) రాజమండ్రి - పురంధేశ్వరి (బీజేపీ) అమలాపురం - గంటి హరీష్ (టీడీపీ) కాకినాడ - ఉదయ్ శ్రీనివాస్ (జనసేన) అనకాపల్లి - సీఎం రమేష్ (బీజేపీ) విశాఖపట్నం - శ్రీభరత్ (టీడీపీ) విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్ (వైసీపీ) అరకు - తనూజారాణి (వైసీపీ) శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు (టీడీపీ) #rtv #andrapradesh #2024-lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి