Free Bus : ఏపీలో మహిళలకు ఫ్రీ బస్? మెగా డీఎస్సీకి నోటిఫికేషన్? నేడు ఏపీ కేబినెట్‌ భేటీ!

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సహా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ రుణమాఫీ లాంటి అంశాలు కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు.

New Update
Free Bus : ఏపీలో మహిళలకు ఫ్రీ బస్? మెగా డీఎస్సీకి నోటిఫికేషన్? నేడు ఏపీ కేబినెట్‌ భేటీ!

AP Cabinet To Discuss Free Bus : ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణ సౌకర్యంపై ఇవాళ జరగనున్న ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి ఈ సమావేశంలో ఆమోదం లభించే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. కర్నాటక(Karnataka), తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వాలు(Congress Government) అమలు చేస్తున్న ఈ పథకం అమలుకు ప్రభుత్వం చేసే వార్షిక వ్యయంపై ఆర్థిక శాఖ సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.

మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు:
ఈ పథకం ప్రవేశపెడితే ప్రభుత్వంపై రూ.1,440 కోట్ల అదనపు భారం పడనుంది. రానున్న ఎన్నికల్లో మహిళా ఓటర్ల మద్దతు పొందేందుకు ఈ పథకం దోహదపడుతుందని అధికార వైసీపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీకి ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కేబినెట్‌ సమావేశంలో ఇది చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌పై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.

ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషనా?
అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌(DSC Notification) కూడా విడుదల చేయని వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం మండిపడుతున్నాయి. సమస్యను లేవనెత్తడం ద్వారా నిరుద్యోగులను తమవైపుకు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది అధికార పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో నిరుద్యోగ యువతను తమవైపునకు తిప్పుకునేందుకు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర ఉపశమనం, మెగా హౌసింగ్ నవరత్నాలు-పెదలందరికీ ఇల్లు ఫ్లాగ్‌షిప్ పథకం, రైతు భరోసా, సున్నా వడ్డీ, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, వ్యవసాయ రుణమాఫీ లాంటి ఇతర అంశాలు కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు.

Also Read: రికార్డుల్లో ఎన్టీఆర్‌ స్మారక నాణెం.. ఎందుకో తెలుసా?

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు