SI Jobs: ఎస్ఐ నియమకాలపై హైకోర్టులో విచారణ.. అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్

ఏపీలో ఎస్ఐ నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రభుత్వం నిబంధనలు పాటించని కారణంగా అనేక మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పరీక్షలను తత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.

New Update
SI Jobs: ఎస్ఐ నియమకాలపై హైకోర్టులో విచారణ.. అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ నియామకాలకు (AP SI Recruitment) సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు (AP High Court) గురువారం విచారణ నిర్వహించింది. పిటిషన్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా 56 వేల మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారని కోర్టుకు తెలిపారు. వారిలో నిబంధనల మేరకు ఎత్తు లేరన్న కారణంతో 5 వేల మందిని తిరస్కరించారని న్యాయస్థానానికి విన్నవించారు. అయితే.. ఈ నియామకాల సందర్భంగా రిజెక్ట్ అయిన అభ్యర్థులందరూ 2019లో క్వాలిఫై అయ్యారని వివరించారు. దీంతో స్పందించిన న్యాయస్థానం.. 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడెందుకు తిరస్కరణకు గురయ్యారని ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి బొత్స శుభవార్త.. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే?

ఈ నియామకాల సందర్భంగా.. డిజిటల్‌ ఎలక్ట్రానిక్‌ మిషన్‌ ద్వారా ఎత్తు కొలిచారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే ఎస్ఐ మెయిన్స్‌ పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాల కారణంగా అభ్యర్థులు నష్టపోయారని.. నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.
ఇది కూడా చదవండి: విశాఖలో ఇన్ఫోసిస్..ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారంటే..!!

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 411 ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్ కూడా పూర్తయ్యాయి. దీంతో దాదాపు 31,193 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో 27,590 మంది పురుషులు ఉండగా.. మహిళా అభ్యర్థులు 3,603 మంది ఉన్నారు. వీరంతా ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న మెయిన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. పరీక్షకు మరో  ఒక్క రోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ వీరిలో వ్యక్తం అవుతోంది.

Advertisment
తాజా కథనాలు