AP High Court: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా

విశాఖకు కార్యాలయాలు తరలించవద్దు అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

New Update
AP: పెన్షన్ల పంపిణీలో పై నేడు హైకోర్టులో విచారణ

Visakhapatnam Camp Office : విశాఖ(Vizag) కు కార్యాలయాలు తరలించవద్దు అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఈ రోజు ఏపీ హైకోర్టు(AP High Court) విచారణ జరిపింది. తాము దాఖలు చేసిన రిట్ ను లంచ్ మోషన్ గా తీసుకోవాలని సి.జే. ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు ప్రభుత్వ న్యాయవాది. అంత అత్యవసరం ఏముంది అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు సిజే. సీజే ప్రశ్నకు సమాధానంగా హైకోర్టు ఆదేశాల కారణంగా విశాఖలో జరగాల్సిన రివ్యూ మీటింగ్స్ ఇతర కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుందని ప్రభుత్వ న్యాయవాది సీజేకు తెలిపారు. ప్రొసీజర్ ప్రకారం మంగళవారమే ప్రభుత్వ వాదనలు వింటామని సిజే దర్మాసనం పేర్కొంది. కనీసం రేపయినా తమ వాదనలు వినాలని సి.జే ధర్మాసనాన్ని అభ్యర్థించారు ప్రభుత్వ న్యాయవాది. ఈ పిటిషన్ లో అంత అర్జెన్సీ ఏమి కనబడడంలేదు అని అభిప్రాయపడ్డా సిజే ధర్మాసనం... మంగళవారమే వాదనలు వింటామని స్పష్టం చేసింది.

ALSO READ: సీఎం గుడ్ న్యూస్.. రేపు అకౌంట్‌లోకి డబ్బు జమ

Advertisment
Advertisment
తాజా కథనాలు