Chandrabau Bail: చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా! ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు 3వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. By Nikhil 29 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు (AP High Court) 3వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఈ పిటిషన్ కు సంబంధించిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుతు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. లింగమనేనికి రింగ్ రోడ్ మార్గంలో భారీగా భూములు ఉన్నాయని శ్రీరామ్ తన వాదనలో తెఇపారు. ఈ నేపథ్యంలో లింగమనేని భూముల పక్క నుంచే వెళ్లేలా రింగ్ రోడ్ అలైన్‌మెంట్ లో మార్పులు చేసినట్లు కోర్టుకు తెలిపారు ఏజీ. లింగమనేని ఎకరం రూ.10 లక్షలకు కొంటే మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత దాని ధర రూ.35 లక్షలకు చేదని ఏజీ వాదనలు వినిపించారు. IRR అలైన్ మెంట్ మార్పుల వల్ల లింగమనేని సంస్థకు లబ్ధి చేకూరిందని కోర్టుకు తెలిపారు. లింగమనేని ఇంట్లో ఉన్నప్పటికీ చంద్రబాబు HRA చెల్లించలేదన్నారు. లింగమనేని, హెరిటేజ్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ నిర్ణయాలు జరిగాయన్నారు. చంద్రబాబు తరఫున లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపిపించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి అకౌంట్ నుంచి లింగమనేనికి అద్దె చెల్లింపులు జరిగాయాన్నారు. చంద్రబాబు బెయిల్ నిరాకరణకు లింగమనేని వ్యవహరం సరైన కారణం కాదని పేర్కొన్నారు. అయితే.. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులను నమోదు చేశారని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇది కూడా చదవండి: Nara Lokesh: ఆంధ్రులకు లోకేష్ సంచలన పిలుపు.. రేపు రాత్రి 7 గంటలకు ఏం చేయాలంటే? ఇదిలా ఉంటే.. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు అనేక ప్రయోజనాలు కల్పించారని, అమరావతి రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్‌కు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏ6గా పేర్కొంది. హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వైస్ చైర్‌పర్సన్, ఎండీగా... చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య బ్రాహ్మణి ఎక్జిక్యుటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఉన్నారని, వారి ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ వ్యవహారాలను చంద్రబాబు, లోకేష్ నడిపిస్తున్నారని సీఐడీ ఆరోపిస్తోంది. హెరిటేజ్‌లో ఈ కుటుంబానికి 56 శాతంపైగా షేర్లు ఉన్నాయనీ, సంస్థ డైరెక్టర్ల బోర్డంతా కుటుంబ ఆధిపత్యంలోనే నడుస్తోందనీ, అమరావతి ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి చంద్రబాబు, లోకేష్‌లు క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారనీ న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో సీఐడీ పేర్కొంది. #chandrababu #chandrababu-arrest #ap-high-court #chandrababu-bail-petition మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి