/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pinnelli-1-1.jpg)
Macherla :మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) కి ఏపీ హైకోర్టు (High Court) లో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం (EVM Violence) సహా మరో మూడు కేసులు పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి ముందస్తు మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపింది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ (Interim Bail) పొడిగించాలని పిన్నెల్లి న్యాయవాది కోరారు. పిన్నెల్లి మీద నమోదైన ఈవీఎం ధ్వంసం కేసుతో లింకై మిగతా మూడు కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు కూడా తర్వాత మాత్రమే కుట్ర పూరితంగా పిన్నెల్లి మీద కేసులు పెట్టారని పిన్నెల్లి న్యాయవాది వాదనలు వినిపించారు.
Follow Us