Neha Reddy : విశాఖ (Visakhapatnam) లో అక్రమ కట్టడాలపై ఏపీ హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది. భీమిలి సముద్ర తీరంలో సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా సాగిన నిర్మాణాలపై హైకోర్టు కన్నెర్ర చేసింది. వైసీపీ (YCP) ఎంపీ విజయిసాయిరెడ్డి (Vijayasai Reddy) కుమార్తె నిర్మించిన ప్రహరీ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని జీవీఎంసీకి కోర్టు ఆదేశం ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.
నిర్మాణాలపై కోర్టులో పిల్ వేశారు జనసేన కార్పొరేటర్ మూర్తి. భీమిలి పరిధిలో ఓ కంపెనీ నుంచి సుమారు మూడున్నర ఎకరాలు కొందరు కొనుగోలు చేశారు. వారి నుంచి కొనుగోలు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కొనుగోలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి సముద్రానికి అతి సమీపంలో కాంక్రీట్ నిర్మాణం చేశారని..ఇసుక తిన్నెలను తొలగించి..గ్రావెల్‌తో చదును చేశారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : నిన్న నాగార్జున.. నేడు పల్లా.. హైడ్రా యాక్షన్‌పై ఉత్కంఠ