CM Chandrababu: చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు

చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సీబీఐ, ఈడీకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Chandrababu:ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ
New Update

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుపై ఉన్న స్కిల్ స్కామ్ కేసును (AP Skill Development Scam) ఈడీ, సీబీఐతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్ దాఖలు అయింది. ఈ కేసులో చంద్రబాబుతో సహా మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుతో పాటు పలువురి పై గతంలోని నమోదైన కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ (CBI), ఈడీ (ED) అప్పగించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు అయింది. వీటితో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, లిక్కర్, ఏపీ ఫైబర్ నెట్ అన్ని కేసులను ఈడీ, సీబీఐ లకు బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈరోజు ఏపీ హైకోర్టులో వాదనలు నడిచాయి.

పిటిషన్ కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయమూర్తికి తెలిపారు. పిటిషన్ విచారణ అర్హతకు సంబంధించిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబుపై పలు కేసులు నమోదు అయ్యాయి. స్కిల్ స్కామ్, ఇసుకలో అక్రమాలు, ఇన్నర్ రింగ్ రోడ్, లిక్కర్ పాలసీలో (Liquor Policy Scam) చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని కేసులు నమోదు అయ్యాయి.

Also Read: సూదికి, దూదికి డబ్బుల్లేవ్.. ఆరోగ్యశ్రీ సేవలకు ఆ ఆసుపత్రులు గుడ్ బై!

ఈ కేసులో చంద్రబాబు దాదాపు 54 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఈ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ చంద్రబాబు విడుదల అయ్యారు. కాగా ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఈ కేసులను రాష్ట్ర ప్రభుత్వం కనుసందల్లో పని చేసే సీఐడీ నుంచి ఈడీ, సీబీఐ లకు బదిలీ చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ఈ కేసుల్లో ఏ1గా ఉన్నారని.. కేసుల నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉన్నందున వాస్తవాలు తెలిసేందుకు ఈ కేసులను బదిలీ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

#ap-high-court #chandrababu-naidu #ap-skill-development-scam #ap-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe