YCP Leaders : ఏపీ హైకోర్టు (AP High Court) లో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. వారికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. టీడీపీ (TDP) కార్యాలయం దాడి కేసులో తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు వైసీపీ నేతలు రఘురాం, అప్పిరెడ్డి , నందిగామ సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఉండవల్లిలోని చంద్రబాబు (Chandrababu) నివాసం పై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల వారు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన ధర్మాసనం ఈరోజు ఆ పిటిషన్లను విచారించేందుకు తిరస్కరించింది.
పూర్తిగా చదవండి..AP High Court : వైసీపీ నేతలకు హైకోర్టు బిగ్ షాక్
AP: వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, టీడీపీ కార్యాలయం దాడి కేసులో రఘురాం, అప్పిరెడ్డి, నందిగామ సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
Translate this News: