AP High Court : వైసీపీ నేతలకు హైకోర్టు బిగ్ షాక్ AP: వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, టీడీపీ కార్యాలయం దాడి కేసులో రఘురాం, అప్పిరెడ్డి, నందిగామ సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. By V.J Reddy 04 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YCP Leaders : ఏపీ హైకోర్టు (AP High Court) లో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. వారికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. టీడీపీ (TDP) కార్యాలయం దాడి కేసులో తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు వైసీపీ నేతలు రఘురాం, అప్పిరెడ్డి , నందిగామ సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఉండవల్లిలోని చంద్రబాబు (Chandrababu) నివాసం పై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల వారు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన ధర్మాసనం ఈరోజు ఆ పిటిషన్లను విచారించేందుకు తిరస్కరించింది. జోగికి డబుల్ షాక్.. ఇటీవల అగ్రిగోల్డ్ భూమలు కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 15 మంది ఏసీబీ (ACB) అధికారులు పాల్గొన్నారు. సీఐడీ జప్తులో ఉన్న అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మినట్లు ఏసీబీ అధికారుల గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల బెయిల్ పై ఆయన కుమారుడు విడుదల అయ్యాడు. అయితే , ఈ కేసులో ఏ1 గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు, ఏ2 గా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, ఏ3 గా అడుసుమిల్లి మోహన్ రామ్ దాస్, ఏ4 గా అడుసుమిల్లి వెంకట సీత మహాలక్ష్మి, ఏ5 గా గ్రామ సచివాలయం సర్వేయర్ దేదీప్య, ఏ6 గా మండల సర్వేయర్ రమేష్, ఏ7 గా డిప్యూటీ తాసీల్ధార్ విజయ్ కుమార్, ఏ8 గా మండల తసీల్ధార్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు అధికారులు. Also Read : ఆ జిల్లాలో విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు #ycp-leaders #ap-high-court #jogi-ramesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి