AP Pensions: ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..ఈ సారి పెన్షన్‌ సెప్టెంబర్‌ 1 కాదు...ఎప్పుడంటే!

ఏపీలో పెన్షన్‌ దారులకు కూటమి ప్రభుత్వం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రతి నెలా ఇస్తున్నట్లు 1 వ తారీఖును కాకుండా ఈ సెప్టెంబర్‌ నెల పెన్షన్‌ ని ఆగస్టు 31నే అందించనున్నట్లు వివరించింది. సెప్టెంబర్‌ 1 ఆదివారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

New Update
CM Jagan: పెన్షన్ రూ.5000లకు పెంపు!

Ap Pensions: ఏపీలోని పెన్షన్‌ దారులకు కూటమి ప్రభుత్వం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రతి నెలా ఇస్తున్నట్లు కాకుండా..సెప్టెంబర్‌ నెల పెన్షన్‌ ని ముందుగానే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రతి నెల 1 వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లను ఈ నెల 31న అంటే శనివారం నాడు ఉదయాన్నే పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం.. ఆ రోజు ఉద్యోగులకు సెలవు అవ్వడంతో ఏపీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో లేకపోవడం, ఏదైనా కారణం వల్లనైనా 31వ తేదీన పెన్షన్లు అందకపోతే.. సెప్టెంబర్ 2వ తేదీన అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Also Read: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం..16 గేట్లు ఎత్తివేత

Advertisment
తాజా కథనాలు