Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్...గ్రామ సచివాలయాల్లో 1896 ఉద్యోగాలు! ఏపీ గ్రామ సచివాలయాల్లోని 1,896 పశు సంవర్థక సహాయకుల నియామాలను చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు.ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 11, 2023, రుసుం చెల్లించడానికి ఆఖరి తేదీ డిసెంబర్ 10. By Bhavana 05 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఖాళీలను పూరించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 1,896 పశు సంవర్థక సహాయకుల నియామాలను చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చొ ఇప్పుడు చూద్దాం.డైరీ సైన్స్ ,డైరీయింగ్ , పౌల్ట్రీసైన్స్,వెటరినరీ సైన్స్ అనుబంధ సబ్జెక్ట్ లలో ఒకేషనల్ ఇంటర్, డిప్లొమో, బీఎస్సీ, ఎమ్మెస్సీ పాస్ అయ్యి ఉండాలి. దీనికి అప్లై చేసేవారికి జులై 1 ,2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. బీసీ వర్గాల వారికి ఐదేళ్లు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి అయితే పదేళ్ల గరిష్ట వయో పరిమితి ఉంటుంది. ముందుగా ఈ పోస్ట్‌లకు సంబంధించి ముందు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా జిల్లాల వారీగా జాబితా విడుదల చేస్తారు. అనంతరం జిల్లా ఎంపిక కమిటీల ద్వారా తుది జాబితా రూపొందించి..నియామకాలు ఎక్కడ అనేది వివరిస్తారు. మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు ప్రారంభ వేతనమే రూ.22,460 నుంచి రూ.72,810 గా చెల్లిస్తారు. దీనికి అప్లై చేసుకునేందుకు ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 11, 2023, రుసుం చెల్లించడానికి ఆఖరి తేదీ డిసెంబర్ 10. హాల్ టికెట్లు ఇచ్చేది డిసెంబర్ 27 నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 31 న పరీక్షను నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://apaha-recruitment.aptonline.in/ ను సందర్శించగలరు. Also read: బలగం వేణు డైరెక్షన్‌లో నేచురల్ స్టార్ నాని! #ap #jobs #grama-sachivalayam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి