AP News : ఏపీ సీఎం వైఎస్ జగన్(AP CM YS Jagan) విద్యా వ్యవస్థ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థను గాడీలో పెట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే గతేడాది విద్యాశాఖ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... ఈ ఏడాది జూన్ నాటికి జూనియర్ కళాశాలలు(Junior Colleges) ఏర్పాటు కావాలని నిర్దేశించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును.. వాటి పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు సీఎం వివరిస్తున్నారు. పాఠశాలలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూడాలని అధికారులకు వెల్లడించారు.
కాగా ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చూసుకోవాలని గతేడాది సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఒకటి బాలికలకు, రెండోది కో ఎడ్యుకేషన్ ద్వారా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జనాభా అధికంగా ఉన్న మండలాల్లో రెండు గ్రామాలు లేదా పట్టణాల్లో రెండు హైస్కూల్స్(High Schools) ఏర్పాటు చేసి వాటిని జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయాలని సూచించారు. ఇందులో భాగంగానే ఏపీలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 210 హై స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారం కోసం ఈ జీవోను పూర్తిగా చదవండి
ఇది కూడా చదవండి : ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు కొత్త రూల్స్…ఆ వాహనాలకు నో పర్మిషన్..!!