Minister Taneti Vanitha: విజయవాడలోని వాంబే కాలనీ రూ. 1.07 కోట్లతో డా. వైయస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్య లక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, డిఎంహెచ్వో సుహాసిని. అనంతరం తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేట్ హాస్పటల్ కు దీటుగా డా. వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందని పేర్కొన్నారు.
ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
వైద్య పరమైన సేవలు అన్ని అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన మందులు ఇవ్వటం జగనన్నకే సాధ్యమైందని అన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉన్నారని తెలిపారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారని హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య శ్రేయస్సు కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కిందని అన్నారు. సీఎం జగన్ తో పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో విద్య వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వంలో లేవని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ ముఖ్యమంత్రి చేసేందుకు ముందున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: BREAKING: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు
18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ: మంత్రి చెల్లుబోయిన
ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు. మరింత మెరుగైన ఫీచర్సుతో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపడుతామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ నెల 18వ తేదీన ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ చేపడుతామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని అన్నారు. ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో జబ్బున్న వాళ్లను జల్లెడ వేసి పట్టమని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ అవగాహన, ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద రూ. 300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరి చేయనున్నట్లు ప్రకటించారు.