3220 Teaching Posts in AP University: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది. ఇప్పటికే అనేక శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తుండగా..తాజాగా యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను పూరించడానికి ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది.
దీనిలో మొత్తం 3,220 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది.అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న 18 యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేయనున్నారు. అయితే రాష్ట్రంలో సుమారు 17 సంవత్సరాల తరువాత విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను పూరిస్తున్నారు.
Also read: రాజకీయ నాయకుడి కొడుకుకే ఆసుపత్రిలో బెడ్ లేదు..ఇక సామాన్యుల సంగతేంటి?
3,220 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా..అందులో 418 ప్రొఫెసర్ పోస్టులు, 801 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 2001 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మంగళవారం నుంచి ఉన్నత విద్యా మండలి ఉమ్మడి పోర్టల్ లో వీటి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఒకే ఫీజుతో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దీనికి ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,500 గా దరఖాస్తు రుసుమును అధికారులు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీబీడీ క్యాండిడేట్లకు రూ. 2 వేలు, ఎన్‌ఆర్‌ఐలు అయితే రూ. 4200 ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏ కేటగిరీ అభ్యర్థులు అయినా సరే రూ. 3 వేలు చెల్లించాల్సి ఉంది. ఎన్‌ఆర్‌ఐలు ప్రొఫెసర్ పోస్టుకు రూ. 12, 600, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ. 8400 చెల్లించాల్సి ఉంది. దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపునకు 20.11. 2023 చివరి తేదీగా అధికారులు నిర్ణయించారు. పోస్టు ద్వారా అయితే చివరి తేదీ 27.11.2023 గా పేర్కొన్నారు.