Chandrababu : చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కార్.!

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈ నెల 10న చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఆయనకు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 29న విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Chandrababu : చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కార్.!
New Update

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈ నెల 10న హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఆయనకు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ పై బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొంది. విచారణ ఈ నెల 29న చేపట్టే అవకాశం ఉంది.

Also Read: టీడీపీ లోకి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి?

ఏపీ రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు తన హయాంలో ఎంత అవినీతి చేశారని.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేష్‌ కుటుంబంతో.. చంద్రబాబు, నారాయణ క్రిడ్‌ప్రోకు పాల్పడ్డారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఐఆర్ ఆర్ అలైన్‌మెంట్ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో సీఐడీకి ఫిర్యాదు చేశారు.

Also Read: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ..!

దీంతో, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబును ఏ-1గా పేర్కొంది. A2గా మాజీ మంత్రి నారాయణ,  A14గా నారా లోకేశ్ పేర్లను నమోదు చేసింది. చంద్రబాబుపై నమోదు అయిన కేసులపై ముందస్తు బెయిల్‌ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో అతని తరఫున లాయర్లు మూడు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిగిన అనంతరం చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.

#andhra-pradesh #chandrababu-bail #jagan-government
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి