Amaravati: ఆ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. మంత్రి పెద్దిరెడ్డి కీలక ప్రకటన

రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా పరిశ్రమలో ఒడిదొడుకులను నివారించేందుకు ప్రభుత్వం నియమించిన సాధికారిత కమిటీ కారణంగా ఇప్పటి వరకు ఆరు సార్లు ఆక్వా ఫీడ్, సీడ్ రేట్ల పెరుగుదలను నియంత్రించగలిగామని కమిటీ సభ్యులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు తెలిపారు.

Amaravati: ఆ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. మంత్రి పెద్దిరెడ్డి కీలక ప్రకటన
New Update

వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆక్వా రైతులకు అండగా నిలవాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయంలో భాగంగా ఆక్వా సాధికారిత కమిటీ ఏర్పాటయ్యిందని అన్నారు. గతంలో ఆక్వా ఫీడ్, సీడ్ రేట్లను నియంత్రించే విధానం లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోయారని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదొడుకులకు స్థానికంగా ఆక్వారంగం ఇబ్బందులను చవిచూసిందని చెప్పారు. వీటిని క్రమబద్దీకరించేందుకు సాధికారిత కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.

This browser does not support the video element.

రాష్ట్రంలో మొత్తం 4.65 లక్షల ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో ఉందన్నారు. దీనిలో పది ఎకరాల లోపు విద్యుత్ సబ్సిడీకి అర్హత ఉన్న విస్తీర్ణం 3.26 లక్షల ఎకరాలని వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ-ఫిష్ సర్వే నిర్వహించిందని తెలిపారు. దీనిలో మొత్తం 46,433 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు సబ్సిడీకి అర్హత ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. అలాగే మరో 4230 కనెక్షన్‌లకు కూడా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తరువాత వారికి కూడా సబ్సిడీకి అర్హత ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కనెక్షన్‌లకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సబ్సిడీ విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు

ప్రస్తుతం రాష్ట్రంలో వంద కౌంట్ రొయ్యలకు కేజీ రూ.240గా రేటు ఖరారు చేశారు. దీంతో ఇంతకన్నా తక్కువకు కొనుగోళ్ళు చేయడానికి వీలులేదు. అలాగే స్థానిక మార్కెట్‌లో ప్రతినెలా వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. దీనిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు అన్నారు. ఆక్వాహబ్‌ల ద్వారా స్థానిక మార్కెట్‌లో వినియోగంను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్యశాఖ) గోపాలకృష్ణ ద్వివేది, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: గుణదల బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు?.. మహాధర్నాకు సీపీఎం పిలుపు

#ap-elections-2023 #secretariat #amaravati #velagapudi #minister-peddireddy-ramachandra-reddy #aqua-empowered-committee-meeting
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe