AP: వారి ఉద్యోగాలకు ఎసరు..ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..!!

అంగన్ వాడీలను తొలగించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ డిమాండ్లను పరిష్కరించాలని 40రోజులుగా అంగన్వాడీలు రోడెక్కి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. వారిని విధుల నుంచి తొలగించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

YCP Focus:  విశాఖపై వైసీపీ స్పెషల్ ఫోకస్..!
New Update

AP: ఇది ఎన్నికల సమయం. ఈ సమయమే అధికారంలో ఉంచాలా?దించాలా?అని నిర్ణయిస్తుంది. ఈ సమయంలో అధికార ఏ చిన్న తప్పు చేసినా..అధికారం కోల్పోవడం ఖాయం. ఇలాంటి సమయంలో ఏపీలోని జగన్ సర్కార్ (Jagan Sarkar)కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అంగన్వాడీల(Anganwadis)ను తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ గత 40రోజులుగా అంగన్వాడీలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చెప్పిన గడువు పూర్తి:
ప్రభుత్వ షోకాజ్ నోటిసు(Show cause notice)ల్లో చెప్పిన గడువు ముగిసింది. అయినా కూడా అంగన్వాడీలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. దీంతో తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే నిబంధనల మేరకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు షురూ చేశారు. ఇప్పటికే రోస్టర్ పాయింట్ల వివరాలను కూడా సేకరించారు. ఇతర పనులు చేపట్టేందుకు శని, ఆదివారం రాత్రుల్లో కూడా క్షేత్రస్థాయిలో అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశాలు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

విధుల్లో చేరేందుకు శనివారం వరకు గడువు:
అంగన్వాడీలు శనివారం వరకు విధుల్లో చేరాలని ప్రభుత్వం గడువు విధించింది. సాయంత్రం 4గంటల వరకు చేరని, చేరినవారి వివరాలను సేకరించింది. అయితే విధుల్లో తిరిగి చేరినవారు చాలా తక్కువే ఉన్నారని తెలుస్తోంది. ఇక కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే ఐదురోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేధించారు. మరోవైపు సర్కార్ జారీ చేసిన నోటిసుల్లో తప్పులు ఉన్నాయని..చర్యలు తీసుకునే ముందు తమ వాదన కూడా వినాలని అంగన్వాడీలు సమాధానం ఇచ్చారు. అలా అవసరం లేదనే ఆలోచనలో ప్రభుత్వ ఉన్నట్లు సమాచారం. ఎన్ని ప్రయత్నాలు చేసినా విధుల్లో చేరింది మాత్రం 10శాతం అంగన్వాడీలే. రాష్ట్ర వ్యాప్తంగా 1.04 లక్షల మంది అంగన్వాడీలు ఉన్నారు. మరి ఈ సమయంలో వారిని తొలగించే సాహసం చేస్తుందా లేదో వేచిచూడాల్సిందే.

ఇది కూడా చదవండి:  కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

#andhra-pradesh #ap-cm-jagan #ap-cm-ys-jagan-mohan-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe