Game Changers : తేలిన ఎన్నికల ఫలితాలు.. ఏపీలో నెక్స్ట్ ఏం జరగబోతోందో చెప్పిన రవిప్రకాష్

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. టీడీపీ, జనసేన కు కలిపి 18 ఎంపీ సీట్లు రావడంతో కేంద్రంలో ఏర్పడనున్న ఎన్డీయే ప్రభుత్వంలో ఆ పార్టీలు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో నెక్ట్స్ ఏం జరుగుతుందో చెప్పారు రవిప్రకాష్. ఆయన పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చూడండి.

New Update
Game Changers : తేలిన ఎన్నికల ఫలితాలు.. ఏపీలో నెక్స్ట్ ఏం జరగబోతోందో చెప్పిన రవిప్రకాష్

Election Results : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్‌కు తెరపడింది. రిజల్ట్స్ మీకు తెలిసిపోయాయి.  దేశ చరిత్రలోనే తొలిసారి ఏపీ కింగ్ మేకర్‌ (AP King Maker) గా మారింది. ఏపీ సపోర్ట్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్‌ లేదు. ఆ ఇద్దరు గేమ్‌చేంజర్స్‌ చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి? నెక్స్ట్ ఏం జరగబోతోంది? అన్న విషయాలను రవిప్రకాష్‌ వివరించారు. రవిప్రకాష్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

చంద్రబాబు కింగ్ మేకర్..
ఏపీలో కూటమి సునామీ సృష్టించింది. ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లతో రికార్డు విజయం సాధించింది. తిరుగులేని విక్టరీతో ఏపీలో కింగ్‌గా మారిన చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లోనూ కింగ్ మేకర్‌గా మారబోతున్నారు.

  • ఈసారి 400 పక్కా అంటూ బరిలోకి దిగిన బీజేపీ (BJP) కి భాగస్వామ్య పార్టీలతో కలిపి 289 సీట్లే వచ్చాయి.
  • 16 ఎంపీ సీట్లతో టీడీపీ NDAలో రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉంది.

ప్రస్తుతం ఏపీ కష్టాల్లో ఉంది. రాష్ట్రానికి అత్యవసరంగా కొంత సాయం కావాలి. అలాగే కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఇవి నెరవేర్చుకోవాలంటే బీజేపీతో ఉండటమే బెటర్‌ అన్నది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే కొన్ని అంశాల్లో టీడీపీ, బీజేపీ మధ్య విబేధాలు తలెత్తే అవకాశమూ లేకపోలేదు. అందులో మొదట చెప్పుకోవాల్సింది మైనార్టీ రిజర్వేషన్లు. ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలమని చెప్పింది టీడీపీ. కానీ ఈ రిజర్వేషన్లకు పక్కా వ్యతిరేకం బీజేపీ. మరీ సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నది మొదటి టాస్క్. ఇక ఇటీవల కేంద్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ బహిరంగంగానే చెప్పింది. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఏపీలో అమలు చేస్తారా లేదా? చేయకపోతే కేంద్రం ఊరుకుంటుందా అన్నది మరో సమస్య. ఈ రెండింటిని టీడీపీ-బీజేపీ ఎలా పరిష్కరించుకుంటాయన్నది ఆసక్తికరం..

ఇప్పుడు కేంద్రం ముందు ఏపీ ఉంచబోయే డిమాండ్లు..

1.ఏపీకి స్పెషల్ స్టేటస్

విభజన సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా కావాలని అన్ని పార్టీలు పట్టుబట్టాయి. దీన్ని విభజన చట్టంలోనూ పెట్టారు. కానీ రాష్ట్రం విడిపోయాక... ప్యాకేజ్‌తో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి హోదాపై గట్టిగా పట్టుబట్టే అవకాశం వచ్చింది.

2.పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా

ఏపీ విభజన చట్టంలో మరో ప్రధాన హామీ పోలవరం ప్రాజెక్టుకి జాతీయహోదా. అయితే హోదా ఇచ్చారు కానీ ప్రాజెక్టు పని మాత్రం జరగలేదు. పదేళ్లయినా పోలవరం కింద పారుదల లేదు, పంటలు పండిందీ లేదు.

3. రాజధాని నిర్మాణానికి ఆర్ధిక సాయం

విభజన అనంతరం వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి సిద్ధమైంది. 2019లో ఓటమి తర్వాత ఆ నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు రాజధాని నిర్మాణ బాధ్యత కూటమిపై ఉంది. దానికి నిధుల బాధ్యత కేంద్రంపై ఉంది.

Also Read : ఊడ్చుకుపోయిన బొత్స కుటుంబం!

Advertisment
తాజా కథనాలు