AP Ex Minister Narayana: ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నోటీసుపై మాజీ మంత్రి నారాయణ (AP Ex Minister Narayana) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. ఈ విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని న్యాయమూర్తి సూచించారు. నారాయణ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి తప్పుకున్నారు. దీంతో విచారణను ఏసీబీ కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. రేపు విచారణకు రావాలని నారాయణకు ఇప్పటికే సీఐడీ (AP CID) నోటీసులు జారీ చేసింది. విచారణ ఎల్లుండికి వాయిదా పడడంతో రేపు నారాయణకు సీఐడీ విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు నారాయణను రేపు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: Chandrababu Lawyers Fee: చంద్రబాబు కోసం రంగంలోని ముగ్గురు దిగ్గజ లాయర్లు.. వారి ఫీజు ఎంతో తెలుసా?
ఇదిలా ఉంటే.. ఇదే కేసులో నారా లోకేష్ కు నిన్న ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 4వ తేదీకి బదులుగా ఈ నెల 10న సీఐడీ (AP CID) విచారణకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. ఈ మేరకు సీఐడీకి ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ ఇటీవల తనకు జారీ చేసిన 41 ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ (Lokesh) సవాల్ చేశారు. లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్ లో షేర్ హోల్డర్ అని చెప్పిన లోకేష్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని వారు వివరించారు. లోకేష్ ను ఇవి అడగడం సమంజసం కాదని న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తన వాదనలు వినిపించారు.
తాము డాక్యుమెంట్ల పై ఒత్తిడి చేయబోమని, రేపే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. అంత తొందర ఏముందని లోకేష్ తరఫు న్యాయవాది పోసాని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10వ తేదీన నారా లోకేష్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాదిని కూడా అనుమతించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. విచారణ సమయంలో మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.