/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Vangaveeti-Radha-jpg.webp)
Vangaveeti Radha: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేనలోకి వంగవీటి రాధా చేరిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. వంగవీటి రాధా కోసం రెండు స్థానాలను జనసేన పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాధాకు మచిలీపట్నం ఎంపీ టికెట్ లేదా అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. పొత్తులో భాగంగా మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని జనసేన తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు సీట్లలో ఏదో ఒకటి రాధాకు ఇవ్వాలని జనసేన ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం బాలశౌరి, నాదెండ్ల మనోహర్‌తో రాధా భేటీ అయిన విషయం తెలిసిందే.