BIG BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలు..? తెలంగాణలో ఆలస్యంగా ఎన్నికలు..!

ఏపీలో ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు జగన్‌. తెలంగాణతో పాటుగా ఏపీలో ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. ఏపీలో ముందస్తు ఎన్నిక సాధ్యాసాధ్యాలపై ఎన్నికల కమిషన్‌ను వివరాల కోరారు అమిత్ షా.

New Update
BIG BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలు..? తెలంగాణలో ఆలస్యంగా ఎన్నికలు..!

Early Elections in AP ?: ఏపీలో ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు జగన్‌. తెలంగాణతో పాటుగా ఏపీలో ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. ఏపీలో ముందస్తు ఎన్నిక సాధ్యాసాధ్యాలపై ఎన్నికల కమిషన్‌ను వివరాల కోరారు అమిత్ షా. ఏపీలో ముందస్తు విషయం తేలే వరకు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈనెల 12-15 తేదీల మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ వెలుపడే అవకాశం ఉంది.

అమిత్‌షాతో ఏం చర్చించారు?
సీఎం జగన్‌ ఢిల్లీ రెండు రోజుల టూర్‌ ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే.. ఆయన రిమాండ్‌ ఖైదీగా ఉన్న సమయంలో జగన్‌ ఢిల్లీ టూర్‌కి వెళ్లారు. అక్కడ కేంద్ర పెద్దలను జగన్‌ కలిశారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, పవన్‌ మినిస్టర్ ఆర్కే సింగ్‌తో పాటు హోంమంత్రి అమిత్‌షాను మీట్ అయ్యారు. ఇదే క్రమంలో కృష్ణ జలాల ట్రైబ్యూనల్‌పై ప్రధాని మోదీకి లేఖ రాశారు. సరిగ్గా ఇదే సమయంలో జగన్‌ ముందస్తు వెళ్తారన్న ప్రచారం మొదలైంది. ఏపీలో ముందస్తు ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఎన్నికల కమిషన్‌ని అమిత్‌షా వివరాలు అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు సహా రాష్ట్రానికి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిశీలించాలని జగన్ అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తోంది.

ముందస్తుకు వెళ్తారా?
పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ఖజానా నుంచి రావాల్సిన రూ.1,310 కోట్ల బకాయిల రీయింబర్స్‌మెంట్ పై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇక ముందస్తు ఎన్నికల విషయంపై స్పష్టమైన క్లారిటీ లేదు కానీ జగన్‌ వెళ్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. టీడీపీ కూడా పలుమార్లు ఇదే చెప్పింది. వైసీపీ మాత్రం ఖండిస్తూ వచ్చింది. అధికార వైసీపీ నేతలు ముందస్తు ఎన్నికలను తోసిపుచ్చినప్పటికీ జగన్‌ మాత్రం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని టీడీపీ భావిస్తోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదన ఉన్నప్పటికీ అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చునని ఢిల్లీ నుంచి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.

ALSO READ: రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు.. అసలు ఏం అయిదంటే..?

Advertisment
తాజా కథనాలు