/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/SHARMILA--jpg.webp)
YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఈరోజు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఎన్నికల అఫిడవిట్ లో షర్మిల తెలిపిన వివరాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. తన అన్న సీఎం జగన్ నుంచి రూ.82.58 కోట్లు అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే తన వదిన భారతి వద్ద రూ.19.56 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు. అలాగే తన భర్త అనిల్‌కు రూ.30 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. విజయమ్మ నుంచి రూ.40 లక్షలు షర్మిల భర్త అనిల్ అప్పుగా తీసుకున్నారు.