AP Elections: 10 మంది టచ్ లో ఉన్నారు.. ఎమ్మెల్సీ వంశీ సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 మంది ఎమ్మెల్సీ లు, 30 మంది కార్పొరేటర్లు తనతో టచ్ లో ఉన్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

New Update
AP Elections: 10 మంది టచ్ లో ఉన్నారు.. ఎమ్మెల్సీ వంశీ సంచలన వ్యాఖ్యలు!

MLC Vamsi Krishna: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ జగన్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ కు నిన్న (శుక్రవారం) ఎమ్మెల్సీ వంశీ తాను వైసీపీకి ఎందుకు రాజీనామా చేశాననే అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు వంశీ. ఆత్మవిశ్వాసం ఉన్న వారేవ్వరూ నా అంత అవమానాలు భరించి వైసీపీలో ఉండరు అంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్నంతకాలం పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. ఈ రాష్ట్రంలో బహుశా ఒక్క రూపాయి తీసుకోకుండా పార్టీ కార్యాలయాన్ని నడిపించింది తానేనని పేర్కొన్నారు. తన మీద కామెంట్స్ చేసే వెదవలు ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వచ్చి 60 ఎకరాలు అమ్ముకున్నానని అన్నారు.

ALSO READ: జగన్ కు షాక్.. మరో వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా?

తనను ఎవరూ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. నన్ను రెచ్చగొట్టారు అందుకే ప్రెస్ మీట్ పెట్టాను అని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'వైసీపీ బీసీలను బాగా చూస్తే.. మేమంతా ఎందుకు బయటకు వచ్చాం.. టాప్ 10 బీసీలు వైసీపీకి యాంటీగా ఉన్నారు.. మంత్రి అమర్ పార్టీ మారినప్పుడు ఆత్మహత్య కాదా..?, నేను పార్టీ మారితే ఆత్మహత్య అవుతుందా..?, అమర్ నువ్వు పార్టీలోకి ఎప్పుడొచ్చావ్.. నేను పార్టీ కోసం జీవితం దార పోసాను.. అమర్ నాకన్నా వెనక వచ్చి జాకపాట్ కొట్టారు.. జగన్ ని బూతులు తిట్టిన వారే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు.. ఏయూ మాజీ వీసీ కార్పొరేటర్ల టికెట్లు డిసైడ్ చేశారు.. ఉత్తరాంధ్రలో పార్టీ పదవులు వేసింది వీసీ ప్రసాద్ రెడ్డి నే.. నా స్థలాలు అన్నీ ప్రభుత్వ భూముల జాబితాలో పెట్టాలని చూశారు.. నన్ను ఓడించాలని మద్యం, డబ్బులు పంపించి నన్ను ఓడించాలని చూసారు.. మంత్రుల దగ్గర నుంచి అందరూ వెళ్లి ప్రసాద్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటున్నారు.. వైసీపీకి మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి సంబంధం ఏమిటి..?, జగన్ చుట్టూ దద్దమ్మలు చేరిపోయారు.. మీరు జైల్ లో ఉన్నప్పుడు ఆయన కోసం పనిచేసిన వారెవరో తెలుసుకోవాలి..10 మంది ఎమ్మెల్సీ లు అందుబాటులో ఉన్నారు.. అరగంటలో దింపగలను.. ముప్పై మంది కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారు.. ఆఫ్టర్ పొంగల్ సినిమా ఎలా ఉంటుందో చూపిస్తా.. వైసీపీలో ఉన్నవారు నా శిష్యులే మొత్తం స్వీప్ చేస్తా" అంటూ వ్యాఖ్యానించారు.

ALSO READ: తిరుమలలో చిరుత సంచారం.. భక్తులకు టీటీడీ హెచ్చరికలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు