Jayaprakash Narayana: ఎన్డీయే కూటమికి జయప్రకాష్ నారాయణ మద్దతు

ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధి చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు.

New Update
Jayaprakash Narayana: ఎన్డీయే కూటమికి జయప్రకాష్ నారాయణ మద్దతు

Jayaprakash Narayana: రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. సంక్షేమం, అభివృద్ధి సమతూకాన్ని పాటించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా?అనే అనుమానం ఉందని పేర్కొన్నారు. ఆర్థిక భవిష్యత్తు కాపాడే వారు ఎవరని ప్రజలు ఆలోచించాలని హితవు పలికారు. సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధి చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు.

ALSO READ: కాంగ్రెస్ అప్పులపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో తుగ్లక్ పాలన..

ఇటీవల ఆర్టీవి అన్ సెన్సార్డ్ షో లో పాల్గొన్న మాజీ IAS, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ దేశ, రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా మౌళికమైన రాజకీయా మార్పుకు మన పార్టీలు సిద్ధంగా లేవని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కేవలం ఓటుకు పరిమితం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. ప్రజల్లో, యువతల్లో చైతన్యం నింపాలన్నారు. కుల మతాలను రాజకీయాల్లో వాడడం చాలా దుర్మార్గమని కామెంట్స్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు పంపిణి లేకుండా ఓటు అనేది లేదని చురకలంటించారు. ప్రజాస్వామ్యంలో బలం, బలహీనత రెండూ ఉంటాయని చెప్పుకొచ్చారు. సంక్షేమం అంటూ పిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో తుగ్లక్ పాలన ఉన్నట్లు ఉందన్నారు. ఏపీ, తెలంగాణ రాజకీయాలపై జేపీ ఏం అన్నారో తెలుసుకునేందుకు, ఆయన విశ్లేషణ కోసం కింద వీడియోను చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు