Janasena MP Candidate: ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ కుమార్ పేరును ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన ఏపీలో రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే.

Janasena: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సమన్వయ కమిటీ నియామకం: జనసేన
New Update

Pawan Kalyan Announced Kakinada MP Candidate: లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ (Tangella Uday Srinivas) పేరును ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన ఏపీలో రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే.

పిఠాపురం నుంచి భారీగా చేరికలు..

పిఠాపురం వైసీపీ నుండి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు ముఖ్య నేతలు. పిఠాపురం కోసం పోటీ చేస్తున్నానని ప్రకటించిన తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పిఠాపురాన్ని తన సొంత నియోజకవర్గంగా చేసుకుంటానని.. దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని మారుస్తానని అన్నారు. యువత కోసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని , స్కిల్ డెవలప్మెంట్ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తానని భరోసా ఇచ్చారు.

ఆ బాధ్యత మీరు తీసుకోండి..

రైతుల కంటి నుండి నీరు రానివ్వనని అన్నారు పవన్ కళ్యాణ్. తనకున్న పరపతితో ఈ ప్రాంత యువతని విదేశాలకు పంపిస్తానని మాట ఇచ్చారు. నన్ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి మిమ్మల్ని నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ వంగా గీత మనవాళ్లే మన దగ్గర నుంచి వెళ్లిన వాళ్లే.. తిరిగి మన దగ్గరికి రావాలని కోరుకుందాం అని అన్నారు. సునీల్ మంచివాడే సరైన సమయంలో సరైన పార్టీని ఎంచుకోలేదని పేర్కొన్నారు.

Also Read: భర్తతో కాపురం చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని వివాహిత నిరసన దీక్ష..!

#pawan-kalyan #ap-elections-2024 #janasena-mp-candidates #tangella-uday-srinivas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe