N.Venkate Gowda: వైసీపీ ఎమ్మెల్యేకు ఎన్నికల సంఘం షాక్!

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై పలమనేరు ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదో తరగతి విద్యార్థులకు సోమవారం ప్యాడ్‌లను పలమనేరు ఎమ్మెల్యే నల్లప్పగారి వెంకటేగౌడ అందించారు. ఈ క్రమంలో ఆయనకు ఈసీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు.

New Update
N.Venkate Gowda: వైసీపీ ఎమ్మెల్యేకు ఎన్నికల సంఘం షాక్!

N.Venkate Gowda Violated Election Code : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై పలమనేరు ఎమ్మెల్యేపై ఈసీ (Election Commission) ఆగ్రహం వ్యక్తం చేసింది. పదో తరగతి విద్యార్థులకు సోమవారం ప్యాడ్‌లను పలమనేరు ఎమ్మెల్యే నల్లప్పగారి వెంకటేగౌడ అందించారు. ఈ క్రమంలో ఆయనకు ఈసీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు (AP Assembly Elections 2024) కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలను ప్రలోభానికి గురి చేయవద్దని రాజకీయ నాయకులు ఈసీ హెచ్చరించిన విషయం తెలిసిందే.

ALSO READ: ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర.. సజ్జల కీలక ప్రకటన

పంచడం తప్పే..

ఎన్నికల్లో కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రజలకు మభ్యపెట్టేందుకు డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, బహుమతులు ఇవ్వడం వంటివి నేరం. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో సోమవారం నాటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు ప్యాడ్ లు, పెన్నులను అందించారు. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలా పంచడం నేరం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్యాడ్ లను పంచాడన్న  వ్యతిరేకించిన కొందరు ప్రతిపక్ష నేతలు ఈసీ కి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ కు దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

ఏపీ ఎన్నికల షెడ్యూల్..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభ తో పాటు నాలుగు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించింది. ఇక తెలంగాణలోనూ ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగారా.

* నోటిఫికేషన్: ఏప్రిల్ 18
* నామినేషన్లకు చివరి తేదీ: 25 ఏప్రిల్
* నామినేషన్లు స్క్రూటినీ- ఏప్రిల్ 26
* ఎన్నికల తేదీ: 13  మే 2024
* ఫలితాలు: జూన్ 4

Advertisment
Advertisment
తాజా కథనాలు